Begin typing your search above and press return to search.
2017 ఆగస్టు 11న ఒక క్రేజీ మూవీ
By: Tupaki Desk | 30 Nov 2016 3:30 AM GMTమన దగ్గర వచ్చే వారం రిలీజ్ అంటే.. ముందు వారానికి కూడా కన్ఫర్మేషన్ రాదు. ఎప్పటికప్పుడు డేట్లు మారిపోతుంటాయి. వారం ముందు ఉన్నట్లుండి రిలీజ్ డేట్ ప్రకటించేసి.. సినిమాను విడుదలకు సిద్ధం చేసేస్తారు. ఐతే బాలీవుడ్లో అలా కాదు. ఒకట్రెండు సంవత్సరాల ముందే రిలీజ్ డేట్లు ఇచ్చేయాల్సి ఉంటుంది. అందులోనూ పెద్ద హీరోల సినిమాలంటే చాలా ముందుగా కర్చీఫ్ వేసేయాల్సి ఉంటుంది. ప్రారంభోత్సవం నాడే రిలీజ్ డేట్ ప్రకటించి.. ఆ తర్వాత షూటింగ్ మొదలుపెడుతుంటారు అక్కడి ఫిలిం మేకర్స్. షారుఖ్ ఖాన్-అనుష్క శర్మల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా తొమ్మిది నెలలుండగానే ప్రకటించారు.
ఇంకా పేరు కూడా నిర్ణయించని ఈ సినిమాను 2017 ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు. జబ్ వుయ్ మెట్.. లవ్ ఆజ్ కల్.. రాక్ స్టార్.. తమాషా లాంటి విలక్షణమైన సినిమాలు రూపొందించిన ఇంతియాజ్ అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ తన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బేనర్ మీద నిర్మిస్తున్నాడు. టైటిల్ కూడా నిర్ణయించుకుండానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో పాటే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ పోస్టర్ బయటికి రాగానే.. ‘‘అదేంటి మన సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయిందా’’.. అంటూ షారుఖ్ ను ట్విట్టర్లో హీరోయిన్ అనుష్క ప్రశ్నించడం విశేషం. ‘‘ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. మేమింకా టైటిల్ కోసం వెతుకుతున్నాం. ఏం చేద్దాం మరి. ఈ డేటుకే ఫిక్సయిపోదామా’’ అంటూ చమత్కరించాడు షారుఖ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/