Begin typing your search above and press return to search.

అనుష్క కోసం దాచుకుంటున్న బాయ్‌ ఫ్రెండ్‌

By:  Tupaki Desk   |   23 Nov 2015 1:30 PM GMT
అనుష్క కోసం దాచుకుంటున్న బాయ్‌ ఫ్రెండ్‌
X
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల మధ్య ఎంత డీప్ అఫైర్ ఉందో అందరికీ తెలుసు. తమ రిలేషన్ పై నోరు మెదపరు కానీ.. దాచుకునేందుకు ఏమాత్రం ట్రై చేయరు. తమ ప్రేమను పబ్లిక్ గా చూపేందుకు కాసింత కూడా మొహమాట పడరు.

లక్షల మంది చూస్తుండగా, మ్యాచ్ జరుగుతుండా విరాట్ ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం, బౌండరీ బయట అనుష్క వాటిని క్యాచ్ లు పట్టడం చాలాసార్లే చూశాం. వరుసగా ఇద్దరిపై విమర్శలు రావడంతో పబ్లిక్ ప్లేసుల విషయంలో వెనక్కి తగ్గుతారేమో అనుకున్నారంతా. కానీ ఇది మరింతగా ముదిరిపోయి వెటకారం స్టేజ్ కి చేరిపోయింది. రీసెంట్ గా ఇద్దరూ కలిసి గోవాలో చక్కర్లు కొట్టొచ్చారు. వీకెండ్ లో బాగా ఎంజాయ్ చేసేసి తిరిగి ముంబై వచ్చేశారు. ఇలా ఇద్దరూ కలిసి జంటగా కనిపిస్తే.. ఫోటోల కోసం ఎగబడ్డం సాధారణమే. అయితే.. గోవాలో చక్కగా నవ్వుకుంటూ ఫోజులిచ్చిన విరాట్ - అనుష్కలు.. ముంబై ఎయిర్ పోర్ట్ కి వచ్చేసరికి స్టైల్ మార్చేశారు.

చేతిలో ఉన్న సూట్ కేస్ తో మొహం దాచుకుంటున్నట్లు కోహ్లీ కలరింగ్ ఇస్తే... పక్కన ప్రియురాలు నవ్వులే నవ్వులు. తర్వాత తీరిగ్గా ఇద్దరూ కలిసి కారెక్కి చెక్కేశారు. ఏమైనా కానీ.. యాక్షన్ చేయడంలో తన లవర్ నుంచి బాగానే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు క్రికెట్ కెప్టెన్. లేకపోతే అంత స్పాంటేనియస్ గా మొహం దాచుకున్నట్లు యాక్షన్ చేయడం కష్టం కదా. ట్రైనింగ్ విషయంలో ఈ బ్యూటీ కూడా పర్ఫెక్ట్ గానే ఇస్తున్నట్లుంది.