Begin typing your search above and press return to search.

అనుష్క బర్త్‌ డే.. ఫ్యాన్స్‌ కు సర్‌ ప్రైజింగ్‌ న్యూస్‌

By:  Tupaki Desk   |   7 Nov 2018 5:10 AM GMT
అనుష్క బర్త్‌ డే.. ఫ్యాన్స్‌ కు సర్‌ ప్రైజింగ్‌ న్యూస్‌
X
టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగి, హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారిన అనుష్క ‘బాహుబలి’, ‘భాగమతి’ చిత్రాల తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెల్సిందే. భాగమతి చిత్రం తర్వాత అనుష్క మళ్లీ కెమెరా ముందుకు వచ్చిందే లేదు. సైజ్‌ జీరో చిత్రం కోసం ఈమె బాగా లావు అవ్వడం, ఆ తర్వాత లావు తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేసినా ఫలితాన్ని ఇవ్వక పోవడం వంటివి జరిగాయి. హెవీ వెయిట్‌ తో భాగమతి చిత్రంలో నటించగా ఆ సినిమా ఫలితం తారు మారు అయ్యింది. అందుకే మళ్లీ ప్రేక్షకుల ముందుకు చాలా సన్నబడి రావాలని అనుష్క కోరుకుంటుంది.

నేడు అనుష్క పుట్టిన రోజు. ఈ సందర్బంగా సోషల్‌ మీడియాలో అనుష్క ఫ్యాన్స్‌ ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అనుష్క నేడు తన బర్త్‌ డేను విదేశాల్లో జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విదేశాల్లోనే అనుష్క ఉంటోందట. అక్కడ బరువు తగ్గేందుకు సహజ సిద్దమైన పద్దతిలో చికిత్సను తీసుకుంటున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. త్వరలోనే చాలా నాజూకు అనుష్కను చూస్తామని అంతా నమ్మకంగా చెబుతున్నారు. ఈ సమయంలోనే అనుష్క గురించిన ఒక ఆసక్తికర అప్‌ డేట్‌ ఒకటి సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

త్వరలో ఒక తెలుగు సినిమాలో అనుష్క కనిపించబోతుందట. అది గెస్ట్‌ పాత్రలోనట. ఆ చిత్రం మరేదో కాదు ‘ఎన్టీఆర్‌’. అవును ఎంతో మంది స్టార్స్‌ ను ఎన్టీఆర్‌ చిత్రంలో దర్శకుడు క్రిష్‌ చూపించబోతున్న విషయం తెల్సిందే. స్టార్స్‌ పాత్రలో స్టార్స్‌ నే నటింపజేస్తున్నాడు. ఎన్టీఆర్‌ తో ఎన్నో క్లాసిక్‌ చిత్రాల్లో నటించిన బి సరోజ దేవి పాత్రను ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చూపించబోతున్నారట. సరోజ దేవి పాత్ర కోసం అనుష్కను సంప్రదించడం - అనుష్క ఓకే చెప్పడం జరిగిందట. త్వరలోనే అనుష్క రెండు లేదా మూడు రోజుల పాటు ‘ఎన్టీఆర్‌’ కోసం డేట్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు తమిళంలో గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని అనుష్క చేయబోతున్న విషయం తెల్సిందే. అనుష్క రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.