Begin typing your search above and press return to search.
కాసుకోండంటున్న అనుష్క
By: Tupaki Desk | 4 Aug 2015 3:49 AM GMTనిన్నటి వరకు అనుష్క లోని రొమాంటిక్ యాంగిల్ నే చూపించాడు గుణశేఖర్. అంతఃపురంలో రాణి రుద్రమగా ఉన్నప్పటి స్టిల్స్ నీ, రానా క్యారెక్టర్ తో సరస సల్లాపాల్లో మునిగి తేలుతున్నప్పటి స్టిల్స్ నీ విడుదల చేశాడు. ఇప్పుడు వీరనారి రుద్రమగా అనుష్క ఎలా ఉండబోతోందో, తెరపై ఎలా విజృంభించనుందో మచ్చుకు కొంచెం రుచి చూపిస్తున్నారు. ఇదిగో అందులో భాగంగా విడుదల చేసిన స్టిల్ ఇదే.
నా కత్తికి ఎదురు లేదు అంటూ కసక్కున కోసేయడానికి సిద్ధమైంది అనుష్క. మరి నన్ను కాసుకోవడానికి మీరు సిద్ధమా అని శత్రువులకి సవాల్ విసురుతున్నట్టు లేదూ! ఇలాంటి విన్యాసాలు బాహుబలిలోనూ బోలెడన్ని ఉన్నాయి. కానీ అవన్నీ సెకండ్ పార్ట్ కోసం అట్టిపెట్టడం గుణశేఖర్ కి బాగా కలిసొచ్చింది. `రుద్రమదేవి`లో అనుష్క లోని రొమాంటిక్ యాంగిల్ నీ, యాక్షన్ యాంగిల్ నీ చూపించబోతున్నాడు గుణశేఖర్.
ఈ సినిమాకోసం కూడా అనుష్క కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ లు నేర్చుకొంది. వాటిని ఎలా ప్రదర్శించిందో తెలియాలంటే సెప్టెంబరు 4 వరకు ఆగాల్సిందే. పైపెచ్చు అనుష్క అందాలు, పోరాటాలు త్రీడీ లో చూపించబోతున్నాడు గుణ. ఇలా బోలెడన్ని కొత్త యాంగిల్స్ ఉన్న `రుద్రమదేవి` విడుదల తేదీ దగ్గరకొచ్చేసరికి మంచి క్యురియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఆన్ లైన్ లో గుణశేఖర్ రోజుకొక స్టిల్ ని విడుదల చేస్తున్నాడు. వాటితో పోలిస్తే ఈ స్టిల్ అదుర్స్ అని చెప్పొచ్చు. వారియర్ గా అనుష్క ఒదిగిపోయింది.