Begin typing your search above and press return to search.

అనుష్క కాస్త హుషారు కలిగించింది

By:  Tupaki Desk   |   18 Jan 2018 4:55 AM GMT
అనుష్క కాస్త హుషారు కలిగించింది
X
టాలీవుడ్ లో ఇటు గ్లామర్ రోల్స్ కు.. అటు హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ కు కరెక్ట్ గా సూటయ్యేది ఎవరంటే కచ్చితంగా గుర్చొచ్చేది అనుష్క పేరే. కానీ ఇప్పుడు గ్లామర్ రోల్స్ కు అనుష్కను దర్శక నిర్మాతలు లెక్కలోకి తీసుకోవడం లేదు. అందుకు కారణం సైజ్ జీరో సినిమాలో క్యారెక్టర్ కోసం బరువు పెరిగిన ప్రయోగం వికటించడమే. ఆ సినిమా తరవాత స్వీటీ మునుపటి బ్యూటీ తగ్గిందనే మాట అంతటా వినిపించింది.

గతేడాది బాహుబలిలో దేవసేనగా అనుష్క అభినయంతో అదరగొట్టేసింది. ఆ తరవాత మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా భాగమతితో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. పిల్ల జమిందార్ ఫేం దర్శకుడు జి.అశోక్ డైరెక్షన్ లో హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాకు ఒకరకంరగా అనుష్క.. ఆమెకున్న ఇమేజే స్పెషల్ అట్రాక్షన్. తాజాగా జరిగిన ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన అనుష్క స్లిమ్మయి సుందరంగా కనిపించడం కాస్తంత సినిమా జనాల దృష్టిని బాగానే ఆకర్షించింది. మొహంలో కూడా కాస్త మునుపటి కళ కనిపించడం ఆమె అభిమానులకు కాస్త హుషారు కలిగించింది.

సైజ్ జీరో కోసం కోరి పెరిగిన బరువు తగ్గించుకోవడానికి స్వీటీ చాలానే కష్టపడాల్సి వచ్చిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తన లుక్ పై నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పటి నుంచి అనుష్క పబ్లిక్ ఫంక్షన్లలో కనిపించలేదు. దాదాపు ఆరునెలల పాటు వర్కవుట్లు.. యోగాసనాలు అవీ చేసి మొత్తానికి ఫర్వాలేదని అనిపించింది. భాగమతి సినిమా తెలుగుతో పాటు తమిళం.. మళయాళం భాషల్లోనూ ఈనెల 26న రిలీజ్ కానుంది.