Begin typing your search above and press return to search.
అనుష్కకు ఆ సత్తా ఉందా?
By: Tupaki Desk | 22 Jan 2018 10:18 AM GMTమొత్తానికి దాదాపు మూడేళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ‘భాగమతి’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘పిల్ల జమీందార్’తో దర్శకుడిగా పరిచయమైన జి.అశోక్.. తన రెండో సినిమాగానే ‘భాగమతి’ చేయాలనుకున్నాడు. కానీ కుదర్లేదు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ఆలస్యమైంది. ఈలోపు అశోక్ చేసిన రెండు సినిమాలు.. ‘సుకుమారుడు’.. ‘చిత్రాంగద’ డిజాస్టర్లయ్యాయి. దర్శకుడిగా తొలి సినిమాతో వచ్చిన పేరంతా పోగొట్టుకున్నాడు అశోక్. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఆలస్యంగా మొదలై.. షూటింగ్ కూడా చాన్నాళ్లు జరుపుకున్న ఈ సినిమాకు అనుకున్నంతగా బజ్ రాలేదు.
ఐతే ‘భాగమతి’ టీజర్.. ట్రైలర్ వచ్చాక పరిస్థితి మారింది. ఈ సినిమాకు బజ్ వచ్చింది. దీనికి తోడు జనవరి 26కు పోటీలో ఉన్న మిగతా సినిమాలు రేసు నుంచి తప్పుకున్నాయి. ఈ చిత్రం సోలోగా రిలీజవ్వడానికి అవకాశం దక్కింది. మంచి బజ్ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా బాగానే రావచ్చు. కానీ సినిమా నిలబడాలంటే కంటెంట్ ఉండాలి. ఈ తరంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తెలుగులో క్రేజ్ తీసుకొచ్చిన తారల్లో అనుష్క పేరు ముందు చెప్పుకోవాలి. ఐతే ‘అరుంధతి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన అనుష్క.. ఆ తర్వాత చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అంచనాల్ని అందుకోలేకపోయింది. ‘పంచాక్షరి’.. ‘సైజ్ జీరో’ డిజాస్టర్లవ్వగా.. ‘రుద్రమదేవి’ అల్లు అర్జున్ పాత్ర వల్లే ఆడిందన్న పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ‘భాగమతి’తో అనుష్క జనాల్ని ఏమేరకు ఆకర్షిస్తుందన్నది ఆసక్తికరం. దర్శకుడు అశోక్ మీద అయితే జనాలకు అంత భరోసా లేదు. ఈ సినిమాకు ఆకర్షణ అంతా అనుష్కే. మరి ఆమె ఈ సినిమాను . తన స్టార్ పవర్ తో ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూడాలి.