Begin typing your search above and press return to search.

అటకెక్కిన అనుష్క సినిమా దించుతున్నారా?

By:  Tupaki Desk   |   21 July 2015 2:28 AM GMT
అటకెక్కిన అనుష్క సినిమా దించుతున్నారా?
X
బాహుబలి: ది బిగినింగ్‌ రిలీజైంది. దేవసేనగా అనుష్క కనిపించింది ఐదు నిమిషాలే అయినా బోలెడన్ని సందేహాల్ని రేకెత్తించి వదిలేసింది. సెప్టెంబర్‌ లో బాహుబలి 2 సెట్స్‌ కెళ్లడానికి రంగం సిద్ధమవుతోంది. ఈలోగానే రుద్రమదేవి 3డి రిలీజైపోతోంది. ఈ మూడు సినిమాలతోనూ స్వీటీ అనుష్కకు లింకుంది. వీటితో పాటు 'సైజ్‌ జీరో' కూడా త్వరలోనే రిలీజ్‌ కి రానుంది. ఈ శుభవేళ మరో శుభవార్తతో స్వీటీ ముందుకు రాబోతోంది. ఆగిపోయింది, ఇక లేదు అనుకున్న ప్రాజెక్టు ను పట్టాలెక్కించేందుకు అనుష్క రెడీ అవుతోందన్నదే ఆ శుభవార్త. డీటెయిల్స్‌ లోకి వెళితే..

అనుష్క కథానాయికగా పిల్ల జమీందార్‌ ఫేం అశోక్‌ దర్శకత్వంలో 'భాగమతి' తెరకెక్కనుందని అప్పట్లో వార్తలొచ్చాయి. భాగ్యనగరి నేపథ్యం లో భాగమతి బయోపిక్‌ తెరకెక్కించడానికి అంతా సిద్ధం చేశారు. అనుష్క కథ విని ఓకే అంది కానీ, కాల్షీట్ల సమస్య వల్ల నటించలేకపోతోందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అదే పాత్రలో నటించడానికి అంజలి రెడీ అవుతోందని అన్నారు. కానీ అది కూడా జరగలేదు. కొంత కాలానికి ప్రాజెక్టు అటకెక్కినట్టే అన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు అనుష్క నటించిన బాహుబలి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన నేపథ్యం లో యు.వి.క్రియేషన్స్‌ ఆలోచన మార్చుకుని తిరగి భాగమతిని పట్టాలెక్కించడానికి రెడీ అవుతోందని చెబుతున్నారు. ఏది నిజం? ఏది రూమర్‌? అన్నది అధికారిక ప్రకటన వస్తేనే తెలిసేది.