Begin typing your search above and press return to search.
అనుష్క మొహం చూసి కొనేశారా??
By: Tupaki Desk | 4 Aug 2017 2:16 PM GMTకొన్ని సినిమాలకు అస్సలు ఏ మాత్రం బజ్ అనేదే లేకపోయినా కూడా.. ఎందుకో వాటికి సడన్ గా పేరొస్తుంది. క్రేజ్ వస్తుంది. విపరీతంగా రేటు కూడా వస్తుంది. అలాంటి క్యాటగిరీల్లో ఇప్పుడు మనం అనుష్క శెట్టి లీడ్ రోల్ లో రూపొందిన ''భాగమతి'' సినిమాను కూడా పడేయొచ్చు తెలుసా. ఎందుకంటే ఈ సినిమాకు అనుష్క దెబ్బతో ఇప్పుడు భారీ బిజినెస్ జరుగుతోంది. ఓ రకంగా యువి క్రియేషన్స్ వారు పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి.
పిల్ల జమిందార్ ఫేం అశోక్ డైరక్షన్లో రూపొందుతున్న సినిమా భాగమతి. నిజానికి అసలు ఇండిపెండెన్స్ డే స్లాటును తీసుకుని ఆగస్టు 11న విడుదలవ్వాల్సిన సినిమా ఇది. అయితే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుండటంతో.. వీరు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. అక్టోబర్ లో విడుదలయ్యే ఛాన్సుందట. ఇకపోతే ఇప్పటికే రెడీ అయిన ఫుటేజ్ ను ట్రైలర్ ను చూపెట్టేసి ఈ సినిమాను అమ్మేస్తున్నారట. అవన్నీ చూసిన ఒక బాలీవుడ్ డిస్ర్టిబ్యూటర్ హిందీ వర్షన్ ను ఏకంగా 12.5 కోట్లకు కొన్నాడట. తెలుగులో కూడా ఆల్రెడీ 40 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ అయిపోయిందని టాక్.
ఈ రేంజులో బిజినెస్ కావడానికి అనుష్కే ప్రధాన కారణం. ఎందుకంటే బాలీవుడ్ లో బొమ్మలు అమ్మేసేంత పెద్ద సినిమాలు అశోక్ తీయలేదు. అలాగే యువి క్రియేషన్స్ బ్యానర్ కూడా అక్కడ పాపులర్ కాదు. కాని దేవసేనగా బాహుబలి 2 సినిమాలో బాగా ఆకట్టుకున్న అనుష్క మాత్రం పాపులర్ అయిపోయింది. తను వెయిట్ ఓవర్ గా ఉండటం వలన అక్కడ సినిమాలను సైన్ చేయట్లేదు కాని.. ఇప్పుడు భాగమతి ని మాత్రం అమ్ముడుపోయేలా చేసింది. అది సంగతి.