Begin typing your search above and press return to search.
అనుష్క భాగమతి మొదలెట్టేశారా??
By: Tupaki Desk | 27 April 2016 1:04 PM GMTఅరుంధతి - రుద్రమదేవి - వర్ణ అంటూ పవర్ ఫుల్ టైటిల్ రోల్స్ చేయడం అనుష్కకు కొత్తేమీ కాదు. ఇప్పటికైతే ఇలాంటి పాత్రలకు ఏకైక ఆప్షన్ అనుష్క మాత్రమే. అప్పుడప్పుడూ ఇతర హీరోయిన్స్ పేర్లు భారీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు వినిపించాయి కానీ.. చివరకు అవేవీ పట్టాలెక్కలేదు. కానీ అనుష్క మాత్రం ఇప్పుడు మరో సినిమాను స్టార్ట్ చేసేసింది. ఇవాళ అంటే ఏప్రిల్ 27 ఉదయం ముహూర్తం షాట్ తీయగా.. స్వీటీ ఈ సినిమా పేరు 'భాగమతి'.
పిల్ల జమీందార్ ఫేం అశోక్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భాగమతిని తెరకెక్కిస్తున్నాడు. అయితే.. ఈ మూవీని మొదట అనుష్క అంగీకరించలేదనే టాక్ ఉంది. వరుసగా ఇలాంటి చారిత్రక చిత్రాలు చేస్తుండడంతో.. తాను ఈ రోల్ చేయనని చెప్పిందట. అయితే, యూవీ క్రియేషన్స్ అధినేతలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఫ్రెండ్స్ కావడంతో.. వాళ్లు ప్రభాస్ ను అప్రోచ్ కాగా.. మన బాహుబలి కలుగచేసుకుని.. అనుష్కను ఒప్పించాడట.
భాగమతి.. అంటే చారిత్రక చిత్రమా కాదా అనే విషయం తేలాల్సి ఉంది. భాగమతి పేరుపైనే భాగ్యనగరాన్ని కులీకుతుబ్ షా.. 4 శతాబ్దాలకు పూర్వం హైద్రాబాద్ ని నిర్మించాడు. మరి అనుష్క భాగమతి.. ఆ భాగమతి అవునా కాదా అనే విషయం ఇంకా తేలలేదు. ఇదో సోషల్ డ్రామా అనే టాక్ కూడా ఉంది. మరి ఈ రెండింటిలో ఏది వాస్తవమో తెలియాలంటే.. యూనిట్ వర్గాలు అధికారిక ప్రకటన చేయాల్సిందే.