Begin typing your search above and press return to search.

అనుష్క, విరాట్.. లైన్ కలుస్తోందా..

By:  Tupaki Desk   |   2 March 2016 12:04 PM GMT
అనుష్క, విరాట్.. లైన్ కలుస్తోందా..
X
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ - ఇండియన్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీల ప్రేమ పట్టాలెట్టి, పాకాన పడి.. తర్వాత బ్రేకప్ కూడా అయిపోయింది. దేశవిదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. ఈ మధ్య ఒకరంటే ఒకరికి పడ్డం లేదు. విడిపోవడం వారి ప్రైవేటు వ్యవహారమే అయినా.. కలిసి షికార్లు మాత్రం పబ్లిక్ గానే కొట్టిన విషయాన్ని మర్చిపోకూడదు. ఇలా వీళ్లిద్దరి బ్రేకప్ తర్వాత.. దీనికి సంబంధించి ఎవరైనా అడిగితే కస్సుబుస్సులాడారు కూడా.

ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విరాట్ కోహ్లీ ఓ ఈవెంట్ లో పాటపాడ్డం కూడా అనుష్క కోసమే అనే టాక్ ఉంది. దీంతో అనుష్క వైపు నుంచి కూడా వ్యవహారం కొంచెం కొంచెం కదులుతున్నట్లు చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా పాకిస్తాన్ తో ఇండియా ఆడిన మ్యాచ్ గెలిచినపుడు.. కంగ్రాట్స్ చెప్పడం కోసం విరాట్ కి అనుష్క ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్ ని అటెండ్ చేసిన విరాట్.. చాలాసేపే మాట్లాడాడని అంటున్నారు. మరోవైపు అనుష్క బ్రదర్ కూడా వీరిద్దరినీ కలిపేందుకు తెగ ట్రై చేస్తున్నాడని సమాచారం.

ఏమైనా.. అనుష్క ఫోన్ కి విరాట్ స్పందించడంతో.. ఈ జంట మళ్లీ చెట్టాపట్టాలకు సిద్ధమవుతోందనే అంచనాలు బాలీవుడ్ లో ఉన్నాయి. కాకపోతే విరాట్ సైడ్ నుంచి కూడా కొంచెం మెత్తబడాల్సి ఉందట.