Begin typing your search above and press return to search.

అనుష్క సోద‌రుడి హ‌త్య‌కు కుట్ర.. హోం మంత్రికి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   13 Jun 2022 11:30 AM GMT
అనుష్క సోద‌రుడి హ‌త్య‌కు కుట్ర.. హోం మంత్రికి ఫిర్యాదు
X
బాహుబ‌లి సిరీస్ చిత్రాల‌తో పాన్ ఇండియా వైడ్ గా స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది అనుష్క శెట్టి. గ‌త ప‌ది హేడేళ్లుగా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ గా త‌న‌దైన ముద్ర వేసింది.

టాలీవుడ్ లో టాప్ హీరోల‌తో న‌టిస్తూ క్రేజీ నాయిక‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. అయితే 'నిశ్శ‌బ్దం' మూవీ త‌రువాత కొంత బ‌రువు పెరిగిన అనుష్క గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తోంది. యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి న‌టిస్తున్న మూవీలో అనుష్క హీరోయిన్ గా న‌టించ‌నుంది.

ఈ మూవీని యువీ క్రియేష‌న్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇదిలా వుంటే అనుష్క సోద‌రుడు గుణ‌రంజ‌న్ శెట్టి హ‌త్య‌కు ప్ర‌ద్య‌ర్థులు కుట్ర ప‌న్నార‌ని, క‌ర్ణాట‌క‌లో గ్యాంగ్ స్ట‌ర్ల మ‌ధ్య త‌లెత్తిన విభేధాల కార‌ణంగానే గుణ‌రంజ‌న్ వెట్టిని హ‌త్య చేయాల‌ని ప్ర‌త్య‌ర్థులు ప్లాన్ చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ప్ర‌ముఖ నేర‌గాడు ముత్తెప్ప రాయ్‌ బ‌తికున్న‌ప్పుడు మ‌న్విత్ రాయ్‌, గుణ‌రంజ‌న్ శెట్టిలు కుడి, ఎడ‌మ భుజంలా వుండేవారు.

అయితే ముత్తెప్ప రాయ్‌ మ‌ర‌ణించిన త‌రువాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలొచ్చాయ‌ట‌. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య వైరం పెరిగి ఇప్పుడు హ‌త్య‌ల దాకా వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ముత్తెప్ప రాయ్‌ స్థాపించిన జ‌య క‌ర్ణాట‌క సంఘం నుంచి గుణ‌రంజ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.

ఆయ‌నే సొంతంగా జ‌య‌క‌ర్ణాట‌క జ‌న‌ప‌ర వేదిక‌ను స్థాపించి మంగ‌ళూరు, బెంగ‌ళూరు ప్రాంతాల్లో చురుగ్గా ప‌ని చేస్తున్నారు. దీంతో అసూయ పుట్టిన మ‌రో వ‌ర్గం నేత మ‌న్విత్ రాయ్ త‌మ నేత గుణరంజ‌న్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌ని ఆయ‌న వ‌ర్గం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆదివారం క‌ర్ణాట‌క రాష్ట్ర హోం మంత్రి అర‌గ జ్ఞానేంద్ర‌కి విన‌తి ప‌త్రాన్ని అంద‌జేశారు. అదే స‌మ‌యంలో త‌మ నేత గుణ‌రంజ‌న్ కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను మ‌న్విత్ రాయ్‌ ఖండించారు. గుణ‌రంజ‌న్ హ‌త్య కు కుట్ర వెన‌క త‌నకు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు.