Begin typing your search above and press return to search.

ప్లాట్ కొన్న‌ది కొహ్లీ కాదు..అనుష్క అట‌!

By:  Tupaki Desk   |   22 Jun 2016 1:30 PM GMT
ప్లాట్  కొన్న‌ది కొహ్లీ కాదు..అనుష్క అట‌!
X
ఇటీవ‌లే క్రికెట‌ర్ విరాట్ కొహ్లీ ముంభైలో రూ.36 కోట్లు ఖ‌రీదైన‌ ప్లాట్ కొనుగోలు చేశాడు. ఆకాశ‌హార్మ్యాల్ని త‌ల‌పించే భారీ భ‌వంతిలో టాప్ ఫ్లోర్‌ లో ఈ ప్లాట్ ఉంది. దీనిని బ‌హుమ‌తిగా త‌న ప్రియురాలు అనుష్క‌కు అంద‌జేసాడ‌ని కూడా ప్ర‌చారం సాగింది. దీంతో ఇద్ద‌రూ అదే ప్లాట్లో క‌లిసి ఉండ‌నున్నార‌ని బాలీవుడ్ మీడియాలో జోరుగా క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే ఈ క‌థ‌లో తాజాగా ఓ ట్విస్ట్ చేరింది. ఈ ప్లాట్ కొన్న‌ది కొహ్లీ కాద‌ట‌. అనుష్క శ‌ర్మ కొహ్లీకి బ‌హుమ‌తిగా ఇచ్చింద‌ని తాజాగా ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అందుకు కార‌ణం విరాట్ స్ర్టాట‌జీనే అంటున్నారు.

ఒక‌ప్పుడు డీప్ లవ్ లో మునిగితేలిన జంట మ‌ధ్య‌లో విడిపోయింది. అందుకు కార‌ణం విరాట్ తో అనుష్క భారీగా డబ్బు ఖ‌ర్చు చేయించ‌డ‌మే అన్నారు. సుమారు విరాట్ చే 59 కోట్లు ఖ‌ర్చు చేయించింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో అనుష్క సొంతంగా ఓ బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మించడం మొద‌లు పెట్టింది. ఎన్.హెచ్7 చిత్రం తానే స్వయంగా నిర్మించి నటించింది కూడా. ఆ స‌మ‌యంలో భారీ మొత్తం అవ‌స‌రం అవ‌డంతో విరాట్ నుంచి తీసుకుంది. త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా మనస్పర్ధలు రావడంతో ఎడ‌ముఖం పెడ‌ముఖంగా ఉన్నారు. కొన్నాళ్ల పాటు మాట్లాడుకోవ‌డం మానేశారు. మ‌ళ్లీ ఇటీవ‌లే క‌లిసి తిర‌గ‌డం మొద‌లు పెట్టారు. విరాట్ ను ఆ బాధ నుంచి బ‌య‌ట‌పడేద్దామ‌ని అనుష్క ఈ ప్లాట్ ను బ‌హుమానంగా అందించింద‌ని బాలీవుడ్ మీడియాలో వార్తలు వ‌స్తున్నాయి.

ఇలా ఆర్థిక లావాదేవీల కారణంగా విడిపోయిన ఈ జంట.. మళ్లీ అవి సద్దు మణగడంతో ఇప్పుడు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ ఆనందం మరింత రెట్టింపు అవ్వాలనే అనుష్కనే ఈ ప్లాట్ ను కొనుగోలు చేసి తన ప్రియుడికి బహుమతిగా ఇచ్చిందట. మరి కోహ్లీ కూడా ఎలాంటి బహుమతిని తన ప్రియురాలికి ఇస్తాడో వేచి చూడాలి.