Begin typing your search above and press return to search.

రొమేనియాలో దేవసేన ఏం చేస్తోందంటే

By:  Tupaki Desk   |   18 March 2016 1:33 PM GMT
రొమేనియాలో దేవసేన ఏం చేస్తోందంటే
X
టాలీవుడ్ దేవసేన కనిపించడం మానేసి చాలా కాలం అయింది. ఈ మధ్య ఎక్కడా అనుష్క శెట్టి మీడియాలో కనిపించడం లేదు. ఆమెకు సంబంధించిన న్యూస్ కూడా రావడం లేదు. అప్పుడెప్పుడో సైజ్ జీరో కోసం పెంచిన సైజులు తగ్గించుకుంటున్నానని చెప్పడం తప్ప.. ఆ తర్వాత అనుష్క నుంచి మాటా మంతి కూడా లేదు. అనుష్క ఏమైపోయిందా అని అనుకుంటున్న అభిమానులకు ఇప్పుడీ భామ దొరికేసింది.

ఖండాలు దాటేసి ఓ స్టార్ హీరోతో పార్టీలు చేసుకుంటోంది ఈ అరుంధతి. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న మూవీ సింగం3. ఈ చిత్రం కోసం యూరోప్ లోని రొమేనియాలో భారీ షెడ్యూల్ నే ప్లాన్ చేశారు. చాలాకాలంగా ఇక్కడే షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పుడు రొమేనియాలో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ కథ పూర్తయిపోవడంతో.. తిరిగి వచ్చే ముందు మొత్తం యూనిట్ అంతా పార్టీ ప్లాన్ చేశారు. ఆ పార్టీలోనే సూర్యతో కలిసి అనుష్క కనిపించింది. ఈ పార్టీ కి సంబంధించిన ఫోటోలే ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి.

ఇండియా వచ్చేసిన తర్వాత కూడా అనుష్క.. ఎస్3 షూటింగ్ లో పాల్గొని దాన్ని ఫినిష్ చేసేస్తుంది. ఆ తర్వాత బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ లో పాల్గొనేందుకు రానుంది అనుష్క శెట్టి. ఈ మూవీ కోసం మళ్లీ కత్తి యుద్ధాల్లాంటివి చేయాల్సి ఉండడంతో.. ఇందుకు సిద్ధమయ్యేందుకు మరో నెల రోజులు పడుతుందని టాక్.