Begin typing your search above and press return to search.
స్వీటీ కాస్తా అనుష్కగా అలా మారిందట
By: Tupaki Desk | 8 Oct 2017 5:25 AM GMTపేరు ఎవరు పెడతారు? పేరెంట్సే కదా? అనుకోవచ్చు. కానీ.. బ్యూటీ అనుష్కకు ఆ పేరు పెట్టింది ఎవరో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఇండస్ట్రీలో స్వీటీగా అందరూ పిలుచుకునే పేరే అనుష్క అసలు పేరు. మరి.. స్వీటీ కాస్తా అనుష్కగా ఎలా మారింది? ఎవరు మార్చారు? స‌్కూల్ రికార్డ్స్ లో ఇంతకీ ఏమని రిజిష్టర్ చేశారు? లాంటి ప్రశ్నలకు అనుష్క.. సారీ స్వీటీ చెప్పిన కబుర్లు ఆమె మాటల్లోనే వినాలి.
నేను పుట్టిన వెంటనే మా పిన్ని నాకు స్వీటీ అని పేరు పెట్టింది. మా పేరెంట్స్ కు సాయిబాబా భక్తులు. దీంతో.. సాయి పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాలనుకున్నారు. కానీ.. వాయిదా పడుతూ వచ్చింది. దీంతో.. స్కూల్ రిజిష్టర్ లోనూ స్వీటీ పేరుతోనే రిజిష్టర్ చేశారు. స్కూల్ కి వెళ్లిన తొలిరోజు నీ పేరేంటి? అని టీచర్ అడిగారు. స్వీటీ అన్నా. పిలవటానికి బాగానే ఉంది.. నీ అసలు పేరు ఏమిటి? అని అడిగారు. స్వీటీనే అసలు పేరు అని చెప్పా. నవ్వారు. అసహనంగా తోచింది.
అలా చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కానీ.. అది నా పేరు కావటంతో ఏమీ చేయలేని పరిస్థితి. సినిమాల్లో ఛాన్స్ వచ్చిన సందర్భంలో నా పేరును స్వీటీగా పిలుచుకోవటం బాగుంటుందని అనిపించలేదు. సెట్లో అందరూ స్వీటీ.. స్వీటీ అంటే ఏం బాగుంటుంది? అదే విషయాన్ని నాగార్జున.. సోనూసూద్ తో చెబితే నిజమేనన్నారు. దీంతో.. నాన్నకి ఫోన్ చేసి మంచి పేరు చూడాలని చెప్పా.
లైఫ్ లో ఎవరి పేరు వారు సెలెక్ట్ చేసే బంఫర్ ఛాన్స్ ఎవరికి రాదని.. నీకు వచ్చింది కాబట్టి పండగ చేస్కో.. నీ పేరు నువ్వే పెట్టుకోమన్నారు. మూడు నెలల వరకూ పేరు కోసం చాలానే ప్రయత్నించా. కానీ.. పేరు నచ్చలేదు. అప్పుడు అనిపించింది.. పేరు సెలెక్ట్ చేసుకోవటం ఇంత కష్టమా? అని.
పేరు కోసం పుస్తకాలు.. వెబ్ సైట్లు.. తెలిసిన వారి సలహాలు.. ఇలా చాలానే చేశా. కానీ.. పేరు మాత్రం కుదర్లేదు. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఉన్నట్లుండి అనుష్క అన్న పేరు బాగుంటుందనిపించింది. ఆ పేరుకు అర్థం కూడా తెలీదు. న్యూమరాలజీ అలాంటివేమీ పాటించలేదు. పేరు బాగుందనిపించటంతో.. మై నేమ్ ఈజ్ అనుష్క అంటూ నాకు నేనే పరిచయం చేసుకున్నా. అందరికి అదే చెప్పా. అలా పేరు మార్చుకున్నా.
అయితే.. పేరు మార్చుకున్నప్పటికీ చిన్నతనం నుంచి అలవాటైన స్వీటీ పేరు మనసులో రిజిష్టర్ అయిపోయింది. అందుకే..అనుష్క అని పిలిస్తే వెంటనే వెనక్కి తిరగలేను. అదే.. స్వీటీ అంటూ చటుక్కున తిరుగుతాను. నా పేరు అనుష్క అని నా మనసుకు నేను చెప్పుకోవటానికి కొంత టైం పట్టింది.