Begin typing your search above and press return to search.

పర్సనాలిటీ ఓకే.. పర్సనల్ వద్దు -అనుష్క

By:  Tupaki Desk   |   12 Nov 2015 7:30 AM GMT
పర్సనాలిటీ ఓకే.. పర్సనల్ వద్దు -అనుష్క
X
గ్లామర్ రంగంలో ఉన్నవారి వ్యక్తిగత జీవితంపై కూడా చాలామంది కన్నేసి ఉంచుతారు. ఉత్సాహంగా తెలుసుకుంటానికి ప్రయత్నిస్తారు చాలామంది. బాలీవుడ్ లో ఈ రచ్చ బాగా ఎక్కువ. కదిలినా మెదిలినా పేజ్ 3 లైఫ్ అంటూ ఫోటోలొచ్చేస్తూ ఉంటాయి. అలాంటిది లవ్ అఫైర్స్ అంటే ఆగుతాయా ? వీటితోటి విమర్శలపాలు కావాల్సి వస్తుంది. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ లైఫ్ కూడా ఇంతే.

విరాట్ కోహ్లీతో ప్రేమలో పడ్డాక.. ఈ అమ్మడి జీవితం బాగా పబ్లిక్ అయిపోయింది. ఇండియా క్రికెట్ టీం మ్యాచ్ ఓడిపోయిన పాపాన్ని కూడా చాలాసార్లు అనుష్క నెత్తిన వేసేశారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే దీనిపై తను ఏమనుకుంటోందో అనుష్క శర్మ నోరు విప్పింది. రీసెంట్ గా ట్వీట్టర్ లో అభిమానుల ప్రశ్నలకు ఆన్సర్ సెషన్ నిర్వహించింది ఈ బ్యూటీ. 'మిమ్మల్ని బాగా విసిగించిన, అలిసిపోయేట్టు చేసే ప్రశ్న ఏది' అంటూ ఓ అభిమాని క్వశ్చన్ చేశాడు. దీనికి జవాబిచ్చేందుకు అనుష్క ఏమాత్రం తడబడలేదు. వ్యక్తిగత జీవితంపై అడిగే ప్రశ్నలు ఏవైనా ఇలాంటివే అని తేల్చి చెప్పేసింది.

ప్రస్తుతం పెళ్లి గురించి ఎలాంటి ప్లానింగ్స్ లేవని, ప్రొఫెషనల్ గా తను ఉన్న స్థానంపై బాగా సంతృప్తిగా ఉన్నానని చెప్పింది అనుష్క. ఇప్పుడు ఏ దిల్ హై ముష్కిల్ షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెప్పిన ఈ భామ.. ఎన్ హెచ్ 10 తన కెరీర్ లో అత్యంత క్లిష్టమైన పాత్ర అంటోంది. ఈ ఏడాది అనుష్క నటించిన బాంబే వెల్వెట్ ఫ్లాప్ కాగా.. దిల్ ధడక్ నే దో మూవీతో సక్సెస్ సాధించింది. అయితే.. ఇప్పటివరకూ తను ఏ మూవీపై కూడా నిరుత్సాహం లేదని, అన్నీ ఇష్టపడి చేశానంటోంది. ఆయా పాత్రల కారణంగా చాలా నేర్చుకున్నట్లు చెప్పింది ఈ బొద్దు గుమ్మ.