Begin typing your search above and press return to search.
కోహ్లీ సెంచరీకి అనుష్క ఫిదా...వైరల్ పోస్ట్!
By: Tupaki Desk | 2 Feb 2018 5:01 PM GMTదక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి నేపథ్యంలో వన్డే సిరీస్ ను భారత్ విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన తొలి వన్డేలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రన్ మెషీన్ గా పేరు పొందిన కోహ్లీ తన వన్డే కెరీర్లో 33వ సెంచరీని సాధించి భారత్ కు డర్బన్ లో తొలి విజయాన్ని అందించాడు. అంతేకాదు, ఛేజింగ్ కింగ్ గా అభిమానులు పిలుచుకునే ఈ ఢిల్లీ బ్యాట్స్ మన్ ....దక్షిణాఫ్రికా వరుస విజయాల(17) రికార్డుకు బ్రేక్ వేశాడు. కఠినమైన పిచ్ పై అలవోకగా బ్యాటింగ్ చేసి.... ఛేజింగ్ లో 20 వ సెంచరీ బాదిన కోహ్లీ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ 20 సెంచరీలలో 18 భారత్ విజయానికి తోడ్పడ్డాయి. అయితే, అన్ని ప్రశంసలలో కెల్లా కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రశంసలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొద్ది రోజుల క్రితం ఇటలీలో ఈ క్యూట్ కపుల్ పెళ్లి చేసుకున్నసంగతి తెలిసిందే. సఫారీ పర్యటనకు ముందు దొరికిన కొద్ది విరామాన్ని విరుష్క జంట తెగ ఎంజాయ్ చేశారు కూడా. ఆ తర్వాత అనుష్క....జీరో షూటింగ్ లో బిజీ అయిపోయింది. టెస్టు సిరీస్ ఓటమి తర్వాత తన భర్త కెప్టెన్సీ పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కోహ్లీ తాజా సెంచరీ అనుష్కకు ఊరటనిచ్చింది. ఆ సెంచరీకి సహచర, మాజీ క్రికెటర్లతో పాటు అనుష్క కూడా ఫిదా అయింది. తన ఆనందాన్ని ఇన్ స్టా గ్రామ్ లో వ్యక్తం చేస్తూ కోహ్లీ సెంచరీ సాధించిన తర్వాత విజయగర్వంతో ఉన్న ఫొటోను పెట్టింది. ఆ ఫొటోపై 'వాట్ ఏ గయ్ ' అని రాసింది. మరో ఫొటోలో `100`అని రాసి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి