Begin typing your search above and press return to search.

పెళ్ల‌య్యాక న‌ట‌న వ‌దిలేస్తాన‌న్న అనుష్క‌

By:  Tupaki Desk   |   1 April 2021 2:30 AM
పెళ్ల‌య్యాక న‌ట‌న వ‌దిలేస్తాన‌న్న అనుష్క‌
X
పెళ్లి త‌ర్వాతా కెరీర్ ని విజ‌య‌వంతంగా సాగిస్తున్న క‌థానాయిక‌లెంద‌రో. టాలీవుడ్ లో అక్కినేని కోడ‌లు స‌మంత విజ‌య‌వంత‌మైన కెరీర్ పెద్ద ఎగ్జాంపుల్. బాలీవుడ్ లో సోన‌మ్ క‌పూర్ పెళ్ల‌య్యాకా విజ‌య‌వంతంగా కెరీర్ ని సాగించారు.కానీ మ‌రో బాలీవుడ్ నాయిక అనుష్క శ‌ర్మ పెళ్లి త‌ర్వాత కెరీర్ ని వ‌దిలేయాల‌నుకున్నార‌ట‌. ఆ సంగ‌తిని త‌నే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం అభిమానుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. టీమిండియా ర‌థ‌‌సార‌థి విరాట్ కోహ్లీని పెళ్లాడి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త‌న గారాల ప‌ట్టీ వామిక‌తోనే అనుష్క‌ లోకం.

అయితే తాజాగా అనుష్క శర్మ పాత‌ వీడియో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అనుష్క శ‌ర్మ‌ దశాబ్దం క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు విపరీతంగా అభిమానుల్ని ఆక‌ర్షిస్తోంది. ఈ ఇంట‌ర్వ్యూలో వివాహం తరువాత జీవితం గురించి అనుష్క చెప్పిన ఓ మాట వైర‌ల్ అయ్యింది.

ఇప్పుడు పెళ్ల‌‌య్యాక కూడా 2011లో ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ అనే షోలో .. వివాహం గురించి అడిగినప్పుడు..``వివాహం చాలా ముఖ్యం. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లలను క‌నాల‌నుంది. అయితే పెళ్ల‌య్యాక నేను ప‌ని చేయాల‌‌నుకోవడం లేదు`` అని తెలిపారు. ఆ వీడియోను ఇప్పుడు అభిమానులు వైర‌ల్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

అయినా అనుష్క శ‌ర్మ కేవ‌లం న‌టిగానే కాదు నిర్మాత‌గానూ పాపుల‌ర‌య్యారు. అందువ‌ల్ల న‌ట‌న‌ను విర‌మించినా నిర్మాత‌గా కొన‌సాగే వీలుంటుంది. కానీ తాను ప‌నిని విర‌మించి గృహిణిగానే మిగిలిపోతారా? అన్న‌దే ఇప్పుడు అభిమానుల‌కు అర్థం కాని ప్ర‌శ్న‌.

2018 డిజాస్ట‌ర్ జీరో (2018) నిరాశ‌ప‌రిచాక‌.. అనుష్క శర్మ కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంకా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే ఇప్పుడు మ‌మ్మీ అయ్యాక కూడా ఆమె ప్రొడక్షన్ హౌస్ బాధ్య‌త‌ల్ని చూసుకుంటున్నారు. ఏప్రిల్ ‌లో తిరిగి న‌టించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలు రావ‌డంతోనే ఆ పాత వీడియోని నెటిజ‌నులు తెర‌పై‌కి తెచ్చార‌న్న‌మాట‌.