Begin typing your search above and press return to search.

అనుష్క డీసెంట్ అండ్ ప్లెజెంట్ లుక్

By:  Tupaki Desk   |   28 Nov 2021 1:30 AM GMT
అనుష్క డీసెంట్ అండ్ ప్లెజెంట్ లుక్
X
బాలీవుడ్ క‌థానాయిక‌ల‌ స్కిన్ షో గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. భామామ‌ణులు గ్లామ‌ర్ ని ఒలికించేందుకు పోటీ ప‌డుతుంటారు. సిల్వ‌ర్ స్క్రీన్ కంటే సోష‌ల్ స్క్రీన్ పై ఫోక‌స్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. డ్రెస్సింగ్ సెన్స్ మొద‌లు.. వెకేష‌న్ స్పాట్ వ‌ర‌కూ వీలైనంత‌గా ఎలివేట్ అవ్వ‌డానికి చూస్తున్నారు. తాజాగా అనుష్క శ‌ర్మ మ‌రోసారి స్కిన్ టైట్ ఆరెంజ్ దుస్తుల్లో డీసెంట్ లుక్ తో క‌నిపించింది. చేతిలో ది వీల్ ఆఫ్ టైమ్ న‌వ‌ల‌ను ప‌ట్టుకుని స్టైలిష్ గా కెమారాకి ఫోజులిచ్చింది. ఇది ప్రైమ్ వీడియోలో రిలీజ‌వుతున్న క్రేజీ వెబ్ సిరీస్ కి ప్ర‌మోష‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సిరీస్ పై ఆస‌క్తి నెల‌కొంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. విరుష్క అభిమానులు ఈ లుక్ పై ఆస‌క్తిక‌ర కామెంట్లు..ఎమోజీలు పోస్ట్ చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇలాంటి దుస్తులు అనుష్క‌ని మ‌రింత అందంగా క‌నిపించేలా హైలైట్ చేస్తున్నాయి. ఇటీవ‌లే అనుష్క ఫిట్ నెస్ విష‌యంలో ఎంతగా శ్ర‌ద్ధ‌ వ‌హిస్తారు? ఓ బిడ్డ‌కు త‌ల్లి అయినా శ‌రీరాకృతిలో మార్పులు రాలేదంటే? అందుకోసం ఎంతో శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని.. ఎంతో క‌మిట్ మెంట్..డెడికేష‌న్ తో ఫ్యాష‌న్ రంగంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

ఇక అనుష్క సినిమాల విష‌యానికి వ‌స్తే.. కొద్ది కాలంగా సినిమాలు త‌గ్గించిన‌ట్లే క‌నిపిస్తోంది. ఎక్కువ‌గా స‌మ‌యాన్ని ఫ్యామిలీ లైప్ కే కేటాయిస్తోంది. కుమార్తె వామిక‌.. భ‌ర్త విరాట్ కోహ్లీ కోస‌మే స‌మ‌యాన్ని గ‌డుపుతోంది. ఇటీవ‌లే దుబాయ్ టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా అనుష్క అక్క‌డే గ‌డిపింది. ప్ర‌స్తుతం `మై `అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తోంది. ఇది నెట్ ప్లిక్స్ సిరీస్. దీనికి అనుష్క శ‌ర్మ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. అలాగే `ఖాలా` అనే మ‌రో వెబ్ సిరీస్ ని కూడా నిర్మిస్తోంది. న‌టిగా మాత్రం కొత్త‌గా సంత‌కాలేవీ చేయ‌లేదు.