Begin typing your search above and press return to search.
హీరోల రెమ్యూనరేషన్ గురించి అనుష్క
By: Tupaki Desk | 23 Jan 2018 10:53 AM GMTశుక్రవారం భాగమతిగా రాబోతున్న అనుష్కపై అంచనాలు మామూలుగా లేవు. సంక్రాంతి సినిమాల్లో ఏదీ అన్ని వర్గాలను మెప్పించడంలో సక్సెస్ కాలేదు కాబట్టి రిపబ్లిక్ డే రోజు వస్తున్న భాగమతి ఈ లోటుని పూర్తిగా తీర్చేస్తుంది అన్న నమ్మకంతో ప్రేక్షకులతో పాటు ట్రేడ్ కూడా ఎదురు చూస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న అనుష్క తనకు ఎదురవుతున్న పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన జవాబులు ఇస్తోంది. హీరొయిన్ల కంటే హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ పే చేయటం గురించి తనకు ఎదురైన కామెంట్ కు బదులిస్తూ అలా చేయటం సహజమే అని, హీరొయిన్ తో పోలిస్తే హీరోకు సినిమాకు సంబంధించిన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని - వాళ్ళ భుజస్కందాల మీద వాటిని మోస్తూ ఉంటారని - కాబట్టి ఇవ్వడంలో తప్పు లేదని తేల్చి చెప్పింది ‘
ఇదే విషయం గతంలో ఇతర హీరొయిన్లు కూడా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హీరోలకు సమానంగా తాము కష్టపడుతున్నప్పుడు పారితోషికం విషయంలో ఇంత వ్యత్యాసం చూపడం ఏంటని కొందరు బహిరంగంగానే కామెంట్ చేసారు. కాని అనుష్క చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని బాషలలో సినిమా వ్యాపారం హీరో ఆధారితంగానే జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టే వాళ్ళకు చెల్లిస్తారు. కాని అరుదుగా హీరొయిన్ సెంట్రిక్ మూవీస్ వచ్చినప్పుడు అప్పుడు కథానాయిక ఇమేజ్ మీద బిజినెస్ జరుగుతుంది. అరుంధతి సినిమాతో అనుష్క అది సాధించింది కాని ఎక్కువ కాలం తాను సైతం అవే తరహా సినిమాలే చేయలేకపోయింది.
గతంలో విజయశాంతి ఒక్కరే హీరో సపోర్ట్ లేకుండా తన పేరు మీద ఓపెనింగ్స్ తెచ్చుకునే రేంజ్ కు చేరుకున్నారు. కర్తవ్యం. ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాల్లో హీరోలు ఉండరు. ఇతర హీరొయిన్లు నటించిన మయూరి - అశ్విని - అమ్మోరు లాంటి ఘన విజయం సాధించిన మూవీస్ లో కూడా హీరోలు కనిపించరు. కాని ఇవి ఏడాది పొడవున వచ్చే అవకాశం లేదు కాబట్టి అనుష్క చెప్పిన లాజిక్ కరెక్ట్ అని ఒప్పుకోవచ్చు.