Begin typing your search above and press return to search.
అనుష్కకి హాట్ సెండాఫ్ ఇచ్చిన లవర్
By: Tupaki Desk | 7 April 2016 7:23 AM GMTటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు బ్రేకప్ లపై గత కొంత కాలంగా మీడియాలో తెగ వార్తలు వచ్చేశాయి. కనీసం ఈ జంట వేలంటైన్స్ డేని కూడా జరుపుకోకపోవడం ఈ రూమర్స్ కి ఊపునిచ్చింది. అయితే.. ఇప్పుడు జరిగిన ఓ సంఘటన ఈ బ్రేకప్ వార్తలన్నీ ఉత్తుత్తివే అని తేల్చేసింది.
నిజానికి ఈ విడిపోవడంపై అనుష్క కానీ, విరాట్ కానీ ఏనాడూ స్పందించలేదు. కాకపోతే గత రెండు నెలలుగా ఈ క్రికెటర్ ఫుల్లు బిజీ. ఆసియా కప్ - వరల్డ్ టీ20 సిరీస్ లతోనే సరిపోయింది. ఇప్పుడు కూడా ఐపీఎల్ కి సిద్ధమయిపోతున్నాడు విరాట్. ఈ లోగా తన ప్రియురాలితో కలిసి సరదాగా డిన్నర్ చేశాడు. ముంబైలోని ఓ పోష్ రెస్టారెంట్ లో వీరిద్దరూ డిన్నర్ చేస్తూ కనిపించారు. నిజానికి వీరిద్దరూ కలిసి రాలేదు. ఎవరి కార్లలో వాళ్లే రెస్టారెంట్ కి వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు జరిగిన సంఘటనే.. వీళ్ల మధ్య బేధాభిప్రాయాలు లేవని తేల్చేసింది.
డిన్నర్ అయిపోయాక.. అనుష్కను పంపించేటపుడు ఆమె కార్ వరకూ వచ్చాడు విరాట్ కోహ్లీ. ఒకట్రెండు నిమిషాలు మాట్లాడాక.. ఓ హాట్ హగ్ ఇచ్చి సెండాఫ్ చెప్పడంతో.. అనుష్కతో బ్రేకప్ లాంటివేమీ లేవని తేలిపోయింది. మొత్తానికి బెస్ట్ కపుల్ అనిపించుకున్న జంట.. బ్రేకప్ కథ ఉత్తుత్తినే అని తేలిపోవడంతో అభిమానులు మాత్రం హుషారుగా ఉన్నారు.