Begin typing your search above and press return to search.
స్వీటీ 12 కేజీలు పెరిగితే ఇలాగుంటుందా
By: Tupaki Desk | 13 July 2015 7:09 PM GMTపాత్రలోకి పరకాయం చేయడం, అందులో జీవించడం ఎలాగో బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్‌కి తెలిసినంతగా వేరే ఎవరికీ తెలీదు. ధూమ్ 3లో కవల సోదరుల పాత్రలో రెండు వేరియేషన్స్ చూపించి షాకిచ్చాడు. పీకే చిత్రంలో అంతరిక్షవాసి పాత్రలో బోలెడంత సర్‌ప్రైజ్‌నిచ్చాడు. ఇప్పుడు ఏకంగా రెజ్లర్‌గా కుస్తీలు పట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇలాంటి వేరియేషన్స్ చూపించాలంటే సౌత్‌లో మళ్లీ కమల్‌హాసన్‌కి మాత్రమే అవకాశం ఉంది.
ఇక కథానాయికల విషయంలో ఇలాంటి వేరియేషన్స్ పలికించే అవకాశమే లేదు. గ్లామర్ ప్రపంచంలో కేవలం నాలుగు సన్నివేశాలు, ఐదు పాటలకే నాయికను పరిమితం చేశారు. కానీ రొటీన్ నాయికలతో పోలిస్తే స్వీటీకి బోలెడన్ని ఛాన్సులు. ఇప్పటికే అరుంధతిగా నిరూపించుకుంది. బాముబలిలో దేవసేనగా కొత్తగా కనిపించింది. త్వరలో రుద్రమదేవిగా వస్తోంది. వీటన్నిటి కంటే విలక్షణమైన మరో పాత్రలో దర్శనమీయబోతోంది. ఒబేసిటీతో బాధపడే లావుపాటి అమ్మాయిగా కనిపించి షాకివ్వబోతోంది.
ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలోని సైజ్ జీరోలో ఈ ఫీట్ వేస్తోంది. ఒబేసిటీ ఉన్న బండ అమ్మాయి జీరోసైజ్ కోసం చేసే ప్రయత్నంలో ఎలాంటి కామెడీ పుట్టిందన్నదే సినిమా. అంతేనా ఈ పాత్రలో నటించడం కోసం 12కేజీల బరువు పెరిగింది స్వీటీ. ఈ కొత్త అవతారంలో ఇటీవలే బాహుబలి సక్సెస్ పార్టీకి వచ్చి షాకిచ్చింది. భూమి గుండ్రంగా ఉండును అన్నట్టు కనిపిస్తోందిప్పుడు.