Begin typing your search above and press return to search.
అనుష్క ఒళ్లు హూనమైపోతోంది పాపం
By: Tupaki Desk | 28 Jun 2015 9:32 AM GMTఅనుష్క పూర్వాశ్రమంలో యోగా టీచర్ కాబట్టి సరిపోయింది కానీ.. మరే హీరోయిన్ కూడా సినిమాల కోసం తన ఒంటిని ఇలా హూనం చేసుకోదేమో. హీరోలు సినిమా కోసం బాడీలు పెంచడం.. సన్నబడ్డం మామూలే. కానీ హీరోయిన్లు మరీ ఈ స్థాయిలో కష్టపడటం అరుదైన విషయమే. బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో సినిమాల కోసం ఏ హీరోయిన్ పడనంత కష్టం పడింది అనుష్క. ఒక సినిమాకు, ఇంకో సినిమాకు రూపం మార్చుకోవడం కూడా పెద్ద విషయం కాదు కానీ.. ఒకే సినిమాలో రెండు రకాలుగా కనిపించాల్సి వచ్చిందని.. ఈ మూడు సినిమాల్లోనూ అలాంటి అవసరం పడిందని చెప్పింది అనుష్క.
''రుద్రమదేవిలో కొన్ని సన్నివేశాల్లో నాజూగ్గా కనిపించాల్సి వచ్చింది. మళ్లీ యుద్ధ సన్నివేశాల కోసం దృఢంగా మారాల్సి వచ్చింది. బాహుబలి సినిమాలోనూ కొన్ని సన్నివేశాలకు బరువు పెరగమన్నారు. కొన్ని సన్నివేశాలకు తగ్గమన్నారు. ఐతే ఈ రెండు సినిమాల షూటింగ్ సమాంతరంగా జరిగింది. సన్నివేశాలకు తగ్గట్లు కొన్ని రోజుల్లోనూ రూపం మార్చుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో నాకు యోగా ఎంతో ఉపయోగపడింది. జిమ్‌లోనూ చాలా కష్టపడ్డాను. బరువు తగ్గాల్సి వచ్చినపుడు పండ్ల రసాలే తీసుకున్నా. పెరగాల్సినపుడు అన్నం ఎక్కువ తిన్నా. ఈ రెండు సినిమాలూ అయ్యాక సైజ్ జీరో కోసం దాదాపు 20 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. దీని కోసం ఇంకా ఎక్కువ కష్టపడ్డా'' అని చెప్పింది అనుష్క. ఏదేమైనా సినిమాల కోసం ఇలా ఒళ్లు హూనం చేసుకునేంత కమిట్మెంట్ అనుష్కకు మాత్రం ఉందని చెప్పాలి.