Begin typing your search above and press return to search.
చికెన్, పీతలు, రొయ్యలు.. లాగించేశా
By: Tupaki Desk | 25 Nov 2015 5:45 AM GMTలావుపాటి అమ్మాయిగా దర్శనమిచ్చి లోకంలోని బొద్దమ్మాయ్ లందరికీ షాక్ ఇచ్చింది స్వీటీ. సైజ్ జీరో మూవీ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ రూపాన్ని డిజైన్ చేసుకుంది. అసలు తనని ఎవరూ బరువు పెరగమని చెప్పలేదు. క్యారెక్టర్ కోసం తనే ఇనిషియేషన్ తీసుకుని లావెక్కింది. దాదాపు 20 కేజీల ఓవర్ వెయిట్ పెరిగింది. అయితే ఇలా చేయడానికి కారణం ఉంది.
ఆ క్యారెక్టర్ కి అది అవసరం. అందుకే అలా చేశాను. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా నాకు మేకప్ వేశారు. ప్రోస్థటిక్ సెటప్ చేశారు. అంతా బాగానే ఉంది. కానీ నా ముఖం మాత్రం చాలా చిన్నగా కనిపించింది. అందుకే నా అంతట నేనుగానే ఓ నిర్ణయానికి వచ్చాను. అయితే దీనికోసం నేనేమీ ట్రైలర్ లో చూపించినట్టు స్వీట్స్ బాగా తిని లావెక్కలేదు. ఆరోగ్య కరమైన తిండి తిన్నా. నాకు చేపలు అస్సలు ఇష్టం ఉండదు. చికెన్ - పీతలు - రొయ్యలు అయితే బాగా లాగించేస్తా. అలా పెరిగిన బరువే ఇది. రోజూ జిమ్ముకెళ్లి కసరత్తులు చేయాల్సిన పనే లేదు. అందుకే వేగంగా బరువు పెరిగాను.. అని చెప్పింది.
ప్రస్తుతం బాహుబలి 2 కోసం బరువు తగ్గుతోంది. ఇప్పటికే 7 కేజీల బరువు తగ్గింది. ఇంకా 10కేజీలు పైగానే తగ్గాల్సి ఉంది. అయితే లావుపాటి అమ్మాయి ఏ షోరూమ్ కి వెళ్లినా డ్రెస్సుల ఎంపిక చాలా ఇబ్బంది అయిపోతోంది. ఇప్పుడున్న ట్రండ్ లో కేవలం సైజ్ జీరో భామల కోసమే దుస్తుల్ని డిజైన్ చేస్తున్నారా? అనిపించి షాకయ్యాను.. అని అనుష్క ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ఈ పద్ధతి మారాలని సూచించింది.