Begin typing your search above and press return to search.
స్వీటీ... నువ్వు సూపరంతే!
By: Tupaki Desk | 27 Nov 2015 1:30 PM GMTనో డౌట్. అనుష్క ముమ్మాటికీ లేడీ సూపర్ స్టారే. ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆమె ఇట్టే ఒదిగిపోతోంది. బాహుబలిలో అనుష్క డీ గ్లామర్ పాత్ర పోషించినా సూపర్ అన్నారంతా. రుద్రమదేవిలో ఆమె కత్తి దూయడం చూసి అనుష్క ముందు కథానాయకులు కూడా దిగదుడుపే అని మాట్లాడుకొన్నారు. ఇప్పుడు సైజ్ జీరోతో మరోసారి తన సత్తాని చాటి చెప్పింది.
స్వీటీ పాత్రలో అనుష్క ఒదిగిపోయిన విధానం చూస్తే ఎవ్వరైనా అదుర్స్ అనాలంతే. చప్పగా నత్తనడకగా సినిమా సాగుతున్నా సరే... తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో - క్యూట్ యాక్టింగ్ తో సినిమాని నిలబెట్టింది అనుష్క. బొద్దుగా కనిపించినా సరే భలే ముద్దుగా అనిపించింది. ఇక నుంచి కుర్రాళ్లు అనుష్కలా కనిపించే బొద్దమ్మాయిల వెంటే పడతారేమో అనిపిస్తోంది. అంత క్యూట్ గా తెర నిండుగా కనిపించింది అనుష్క.
బాహుబలి - రుద్రమదేవిలాంటి సినిమాల తర్వాత అనుష్క సైజ్ జీరో అనగానే చాలామంది నొసలు చిట్లించారు. ఇలాంటి దశలో ప్రయోగాలు అవసరమా? అసలు కత్తి చేతపట్టి అదరగొట్టిన అనుష్క ఒబేసిటీతో బాధపడే అమ్మాయిగా ఎలా రక్తి కట్టిస్తుందనీ? అంటూ మాట్లాడుకొన్నారు. కానీ అనుష్క మాత్రం పూర్తి నమ్మకంతో ఆ పాత్రని భుజాన వేసుకొంది. అంతే కాదు... పాత్ర కోసం బరువు పెరిగి మరీ నటించింది. ఆమె ప్రయత్నం చూసి పరిశ్రమలో అంతా శభాష్ అన్నవాళ్లే. ఇప్పుడు అందుకు తగ్గ ఫలితమే అందుకుంటోంది అనుష్క.
ఉదయమే విడుదలైన సైజ్ జీరోకి మిక్స్ డ్ రివ్యూస్ వస్తుండొచ్చుగాక... కథ గురించి ఇతరత్రా విషయాల గురించి ఒకొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతుండొచ్చుగాక... అనుష్క విషయంలో మాత్రం అందరూ నూటికి నూరు మార్కులేస్తున్నారు. పదేళ్ల గురించి అసలు సినిమా అంటే ఏంటో అవగాహన లేని అనుష్క ఇప్పుడు పాత్రల్లో ఒదిగిపోతున్న విధానం చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. కొత్తతరం అమ్మాయిలకి అనుష్క ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.