Begin typing your search above and press return to search.

కోచ్‌తో సైజ్‌ జీరో భామ లవ్‌!!

By:  Tupaki Desk   |   1 July 2015 7:22 AM GMT
కోచ్‌తో సైజ్‌ జీరో భామ లవ్‌!!
X
స్వీటీ అనుష్క ప్రస్తుతం ఏం చేస్తోంది? బాహుబలి, రుద్రమదేవి చిత్రీకరణలు పూర్తయి, రిలీజ్‌లకు రెడీగా ఉన్నాయి. జూలై 10న బాహుబలి రిలీజ్‌ సందర్భంగా ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో చిట్‌చాట్‌, ఇంటర్వ్యూలు, లైవ్‌ చాట్‌లు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేసింది. అదే తీరుగా కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ప్రచారానికి సిద్ధమవుతోంది. మరోవైపు తాజా చిత్రం సైజ్‌ జీరో చిత్రీకరణలో పాల్గొంటోంది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి 'సైజ్‌ జీరో' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క ప్రధాన నాయిక. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్నాడు. లావుపాటి అమ్మాయి ఉన్నట్టుండి జీరో సైజ్‌కి మారిపోవాలనుకుంటుంది. దానికోసం ఓ కోచ్‌ని ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత ఆ ఇద్దరిమధ్యా ఏం జరిగిందనేదే సినిమా. ఇదో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. కథంతా స్వీటీ చుట్టూనే తిరుగుతుంది.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో కీలకసన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సైజ్‌ జీరో అవ్వాలనుకున్న ఆ అమ్మాయితో ప్రేమలో పడిన కథానాయకుడు తన ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ ఆర్య ఐ లవ్‌ యు చెప్పాడా? లేదా? శిష్యురాలు ఓకే చెప్పిందా? లేదా? అన్నది తెరపైనే చూడాలని అంటున్నారు ప్రకాష్‌ కోవెలమూడి. దర్శకుడికి ఈ సినిమా విజయం సాధించడం చాలా కీలకం. స్వీటీ రూపంలో ప్రకాష్‌కి ఓ హిట్‌ దక్కుతుందేమో చూడాలి.