Begin typing your search above and press return to search.
బాహుబలి-2లో ఆమెను చూసి షాకవుతారు
By: Tupaki Desk | 24 Nov 2016 1:30 AM GMTగత ఏడాది సీనియర్ బ్యూటీ అనుష్క తన అభిమానులకు మామూలు షాకులివ్వలేదు. ఓవైపు ‘బాహుబలి’ సినిమాలో భయంకరమైన అవతారంలో దర్శనమిచ్చి గ్లామర్ ప్రియులందరినీ విస్మయానికి గురి చేసింది. మరోవైపు ‘సైజ్ జీరో’ సినిమా కోసం విపరీతంగా లావై ఇంకో రకమైన షాకిచ్చింది. అప్పటిదాకా అనుష్కకు ఉన్న గ్లామర్ ఇమేజ్ ఈ రెండు సినిమాలతో దెబ్బ తిందన్నది వాస్తవం. వీటి వల్ల అనుష్కకు కలిగిన ప్రయోజనం కంటే.. నష్టమే ఎక్కువ. అనుష్కను ఈ అవతారాల్లో చూసి ఆమె అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు అర్జెంటుగా ఈ ఇమేజ్ మార్చుకుని.. తన గ్లామర్ కోణాన్ని బయటపెట్టాల్సిన స్థితిలో ఉంది అనుష్క.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘ఎస్-3’లో అనుష్క పాత్ర చాలా పరిమితం అంటున్నారు. అందులో ఆమె ఎలా కనిపిస్తుందో కానీ.. బాహుబలి-2లో మాత్రం అనుష్క లుక్ అదిరిపోతుందని సమాచారం. కొన్ని నెలల పాటు శ్రమించి బాగా బరువు తగ్గిన అనుష్క.. మూణ్నాలుగేళ్ల కిందట ఉన్న లుక్ లో కనిపిస్తుందట. తాజాగా బాహుబలి-2కు సంబంధించి ఒక వీడియో లీక్ అయిందన్న సంగతి తెలిసిందే. అది ఏమాత్రం క్లారిటీ లేని వీడియో కావడం.. అది కూడా పెద్దగా సర్కులేట్ కాకపోవడంతో పెద్దగా డ్యామేజ్ ఏమీ జరగలేదు. ఐతే ఆ వీడియోలో అనుష్క చాలా స్లిమ్ గా కనిపించిందని.. ఆమె లుక్ అదిరిపోయిందని అంటున్నారు. సినిమాలో అనుష్కను చూసి జనాలు షాకవడం గ్యారెంటీ అట. ‘బాహుబలి: ది బిగినింగ్’లో తమన్నాతో పచ్చబొట్టేసినా.. పాట తరహాలోనే ‘ది కంక్లూజన్’లో అనుష్కతో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఒకటి ఉంటుందట. ఆ పాటతో అనుష్క మళ్లీ కుర్రాళ్ల కలల రాణిగా మారిపోవడం ఖాయమంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/