Begin typing your search above and press return to search.

దేవసేన.. వేలు కొరుకుతోంది

By:  Tupaki Desk   |   24 April 2017 9:11 AM GMT
దేవసేన.. వేలు కొరుకుతోంది
X
టాలీవుడ్ లో ఏడాదికి 200 సినిమాల వరకూ వచ్చేస్తుంటాయి. ఇది రిలీజ్ అయ్యే వాటి సంఖ్య మాత్రమే. షూటింగ్ పూర్తి చేసుకుని ల్యాబ్స్ లో ఉండిపోయే వాటితో కలుపుకుంటే ఈ కౌంట్ ఇంకా పెరుగుతుంది. ఇన్ని వందలు వేల సినిమాల మధ్య బాహుబలి గురించే జనాలు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ప్రధాన కారణం జక్కన్న అయితే.. రెండో రీజన్ ఆ సినిమాలోనే కేరక్టరైజేన్.

సినిమాలోని ప్రధాన నటీనటులకు ఇచ్చిన పాత్రలు.. వాటి తీరుతెన్నులు.. ముఖ్యంగా ఆయా పాత్రల పేర్లతోనే బోలెడంత ఆసక్తి కనిపిస్తుంది. దేవసేనగా నటించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క.. బాహుబలి1లో ఎలా కనిపించిందో.. బాహుబలి2లో ఎలా కనిపించనుందో అనే విషయంపై జనాలకు క్లారిటీ ఉంది. అయితే.. ఇది స్క్రీన్ ముందు మాత్రమే కనిపించే ధీరత్వం. ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారనే సంగతి అంతగా పైకి తెలియదు కానీ.. బాహుబలి సెట్స్ కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు భలే ఫన్నీగా ఉంది.

జక్కన్న ఏదో చెబుతుంటో.. నోట్లో వేలు పెట్టుకుని కొరుక్కుంటూ నవ్వుకుంటూ చూస్తున్న అనుష్క ఫోటో భలేగా ఉంది. అనుష్క నుంచి ఇలాంటి ఎక్స్ ప్రెషన్ కామనే కానీ.. దేవసేన గెటప్ లో ఉంటూ తన సహజమైన ఫీలింగ్స్ ఉండడమే ఈ ఫోటోకు అట్రాక్షన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/