Begin typing your search above and press return to search.
స్వీటీ దాగుడు మూతలు ఎందుకు?
By: Tupaki Desk | 8 July 2019 2:47 PM GMTస్వీటీ అనుష్క శెట్టికి `సైరా` సెట్స్ లో గాయం అయ్యిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి షేర్ చేసిన అనుష్క ``నేను ధిట్టంగా ఉన్నాను. సీటెల్ లో షూటింగులో పాల్గొంటున్నా`` అంటూ ట్విస్టిచ్చారు. స్వీటీ సీటెల్ లో ఉంటే సైరా షూటింగ్ లో పాల్గొందన్న ప్రచారం ఉత్తుత్తేనని అంతా గ్రహించారు.
అనుష్క ప్రస్తుతం `సైలెన్స్` అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసమే సీటెల్ (అమెరికా) వెళ్లారు. ఇదివరకూ రిలీజ్ చేసిన ఫోటో వైరల్ గా ప్రమోటైంది. తాజాగా మరికొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాయి. ఈ ఫోటోల్లో స్వీటీ దాగుడు మూతలు ఆడుతోంది. ట్యాలెంటెడ్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టార్ వెనకగా అలా దాక్కుంటూ కనిపించారు. ఈ ఫోటోల్లో అనుష్క స్లిమ్ లుక్ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తోంది.
సైజ్ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క అటుపై మునుపటి రూపానికి మారేందుకు స్వీటీ హార్డ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఆ హార్డ్ వర్క్ ప్రతిఫలించి తెరపై స్లిమ్ లుక్ తో అలరించబోతోందని అర్థమవుతోంది. అందుకే మారిన రూపం రివీల్ కాకుండా నేరుగా పెద్ద తెరపైనే సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చేందుకు స్వీటీ ప్రయత్నిస్తోందని అర్థమవుతోంది. సైలెన్స్ మూవీలో అనుష్కతో పాటు ఆర్.మాధవన్ నటిస్తున్నారు. భాగమతి తర్వాత స్వీటీ నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రమిది.