Begin typing your search above and press return to search.
దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?
By: Tupaki Desk | 31 July 2020 11:30 PM GMTలాక్ డౌన్ వలన గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో విడుదల కావల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరికొన్ని నెలల వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక టైం దొరికింది కదా.. జనాలు ఓటిటిలకు అలవాటు పడిపోయారు. ఈ ఛాన్సులను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి సంస్థలు విడుదల కాకుండా నిలిచిన సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం విడుదల కాకుండా ఆగిపోయింది అనుష్క మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ 'నిశ్శబ్దం'. నిజానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు చందాల ప్రాతిపదికన పనిచేస్తాయి కానీ రెవిన్యూ షేరింగ్ ప్రాతిపదికన కాదు. అందుకే డిజిటల్ హక్కుల కోసం భారీగా డబ్బును ఖర్చు చేస్తే.. భారీ నష్టాలే మిగులుతాయి తప్ప భారీగా లాభాలను మాత్రం పొందలేరు.
అందుకే ఈ డిజిటల్ విడుదల ఒప్పందాలు కరెక్ట్ కాదని నిశ్శబ్దం మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ అనుష్క అభిమానులు నిరాశలో ఉన్నారు. ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకొని చేసిన నిశ్శబ్దం మూవీ రిలీజ్ కాకుండా నిలిచిపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అనుష్క తదుపరి ప్రాజెక్ట్ ఏంటని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే తాజాగా అనుష్కను నెట్ ఫ్లిక్స్ ఓటిటి వారు ఓ భారీ మల్టీ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ ఆఫర్ చేశారట. అందుకోసం భారీ పారితోషికం ఇవ్వడానికి కూడా ఓకే అన్నారట. కానీ అనుష్క వారి ఆఫర్ రిజెక్ట్ చేసిందట. ఇప్పట్లో వెబ్ సిరీస్ లలో నటించే ఇంటరెస్ట్ లేదని చెప్పిందట. మరి స్వీటీ తదుపరి ప్రాజెక్ట్ ఏమిటని.. అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ దీని పై స్వీటీ ఎలా స్పందిస్తుందో చూడాలి!