Begin typing your search above and press return to search.

గుణశేఖర్‌ చేయాలి కాని.. ఆమె చేస్తోంది

By:  Tupaki Desk   |   20 Oct 2015 6:10 AM GMT
గుణశేఖర్‌ చేయాలి కాని.. ఆమె చేస్తోంది
X
మీ ఇంటికొస్తే ఏమిస్తావ్‌? మా ఇంటికొస్తే ఏం తెస్తావ్‌? ఇదీ నేటిలోకం తీరుతెన్నులు. కానీ ఇలాంటి లాభాపేక్ష‌కు అతీతంగా టాలీవుడ్‌ లో ఓ స్నేహం వెల్లివిరిసింది. నేస్త‌మా నేస్త‌మా నీకోసం... అన్న‌చందంగా మారింది స‌న్నివేశం. ఓ నా స్నేహ‌మా నువ్వు నాకు అది ఇచ్చావ్‌.. నేను నీకు ఏది ఇస్తానో ప్రాక్టిక‌ల్‌ గా చూస్కో అంటూ ఆ స్నేహితురాలు ఎంతో ఇదైపోతోంది. ఇంత‌కీ ఎవ‌రీ స్నేహితులు అనే సందేహం వ‌చ్చిందా? ఆగండి.. అక్క‌డికే వ‌స్తున్నాం. ఈ స‌న్నివేశంలో స్నేహితులు బ‌న్ని అండ్ అనుష్క‌.

ఆగిపోయింది అనుకున్న సినిమాని ముందుండి న‌డిపించాడు బ‌న్ని. అస‌లు ఈరోజు రుద్ర‌మ‌దేవి 3డి రిలీజైంది అంటే అది అల్లువార‌బ్బాయ్ చొరవ‌, తెగువ వ‌ల్ల‌నే.ఒక‌వేళ ఈ సినిమా ఆగిపోయి ఉంటే అది క‌చ్ఛితంగా గుణ‌శేఖ‌ర్‌ కి, అనుష్క‌కి బ్యాడ్ నేమ్ తెచ్చేదే. ఎంద‌రో హీరోలు వ‌ద్ద‌నుకున్నా బ‌న్ని నేనున్నా అంటూ గుణ‌శేఖ‌ర్ వెన్ను త‌ట్టి గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌లో న‌టించాడు. ఆ క్యారెక్ట‌ర్ ఈ చిత్రాన్ని నిజంగానే బ‌తికించింది. అందుకు చిత్ర‌క‌థానాయిక‌, టైటిల్ పాత్ర‌ధారి అనుష్క బ‌న్నికి ఓ కానుక ఇస్తోంది. నేను నీ సినిమాలో ఐటెమ్ నంబ‌ర్ చేస్తానంటూ వ‌ర‌మిచ్చింది. బ‌న్ని చేసిన సాయానికి స్వీటీ మ‌న‌సులో స్నేహం గూడుక‌ట్టుకుంది. ఆ స్నేహంతోనే ఈ ఐటెమ్‌. ఇది గ్రాటిట్యూడ్ అనుకోండి.

అయితే బ‌న్ని చేసిన‌దానికి గుణ‌శేఖ‌రుడు ఏదైనా జంబో ప్యాకింగ్ ప్లాన్ చేయాలి కానీ ఇలా స్వీటీ వెంప‌ర్లాడ‌డ‌మేంటి అని ప్ర‌శ్నించేవాళ్లు ఉన్నారు. అయితే అనుష్క త‌న సినిమా అనుకుని చేసింది కాబ‌ట్టే అందుకు బ‌న్నికి కృత‌జ్ఞ‌త చెబుతోంది. గ‌తంలోనూ బ‌న్ని మంచి మనసుతో క్రిష్ వేదంను ముందుకు న‌డిపించాడు. వీట‌న్నిటికీ స్వీటీ చెబుతున్న కృత‌జ్ఞ‌త అనుకోండి.