Begin typing your search above and press return to search.
అనుష్క లుక్ తేడా కొడుతోందిగా
By: Tupaki Desk | 1 Jun 2016 7:30 PM GMTస్వీటీ అనుష్క సినిమా కోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధం అంటుంది. అందుకే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అన్నీ ఆమె దగ్గరకే వచ్చేస్తాయి. తను చేసే ప్రతీ పాత్రకు న్యాయం చేసేందుకు తపన పడ్డం అనుష్క స్పెషాలిటీ. వేదం - అరుంధతి లాంటి అనేక సినిమాల్లో అనుష్క యాక్టింగే స్పెషల్ అట్రాక్షన్ అయిందంటే.. ఆమె రేంజ్ ఏంటో అర్ధమవుతుంది.
గతేడాది విడుదలైన సైజ్ జీరో కోసం అయితే.. అనుష్క తన సైజ్ ను భారీగా పెంచుకుంది. ఒబేసిటీ అమ్మాయి పాత్ర కోసం తనే బరువు పెరిగింది. ఆ తర్వాత పెద్దగా మీడియా కంట పడని అనుష్క.. తాజాగా బాహుబలి చైనీస్ వెర్షన్ ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చింది. ఇక్కడ ప్రభాస్ సహా బాహుబలి యూనిట్ ఉన్నా.. అందరి కళ్లు అనుష్క పర్సనాలిటీపైనే ఉన్నాయి. ఇందుకు కారణం.. అనుష్క ఇంకా లావుగా కనిపిస్తూ ఉండడమే. ఇప్పుడు స్వీటీ పలు భారీ చిత్రాల షూటింగ్ లలో పాల్గొనాల్సి ఉంది. బాహుబలి 2 తో పాటు.. భాగమతి - సింగమ్ 3 చిత్రాల షూటింగ్ కు కూడా హాజరు కావాల్సి ఉంది.
మరి వీటి షూటింగ్ లో అనుష్క జాయిన్ కావాలంటే.. ఖచ్చితంగా పాత రూపంలోకి మారాలి. కానీ అనుష్కను చూస్తే.. ఇంకా తగ్గాల్సిన సైజులు చాలానే ఉన్నాయని అర్ధమవుతుంది. తన మూలంగా మూవీ షెడ్యూల్స్ డిస్టర్బ్ అయేందుకు ఇష్టపడని అనుష్క.. ఇప్పుడీ వెయిట్ ను ఎలా తగ్గించుకుంటుందో మరి!!