Begin typing your search above and press return to search.

అంత స్లిమ్ స్వీటీ.. హౌ అండీ హౌ?

By:  Tupaki Desk   |   27 Jan 2017 6:06 AM GMT
అంత స్లిమ్ స్వీటీ.. హౌ అండీ హౌ?
X
బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ పూర్తయిపోవడంతో.. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు పబ్లిసిటీ వర్క్స్ కూడా ఒకేసారి చేయాలని డిసైడ్ అయింది బాహుబలి యూనిట్. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా.. అమరేంద్ర బాహుబలి- దేవసేనల పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది సూపర్బ్ గా ఉంది కానీ.. ఈ పోస్టర్ ని చూశాక అందరికీ ఓ అనుమానం వేధిస్తోంది.

బాహుబలి కొత్త పోస్టర్ లో అనుష్క చాలా అందంగా కనిపించడమే కాదు.. తెగ స్లిమ్ గా నాజూకు నడుము అందాలతో కనిపించింది. ఈ పాయింటే అందరికీ డౌట్స్ తెప్పిస్తోంది. సైజ్ జీరో తర్వాత అనుష్క సైజ్ ఏ రేంజ్ లో పెరిగిందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ సైజ్ విషయంలో పెద్దగా మార్పుల్లేవనే విషయం తెలిసిపోతోంది. మరి బాహుబలి2 పోస్టర్లో మాత్రం ఇంత సన్నగా కనిపించడానికి.. గ్రాఫిక్స్ మాయాజాలమే కారణమా అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే.. స్వీటీ సన్నబడ్డం కోసం కొన్ని నెలల పాటు ఎదురుచూశారు జక్కన్న అండ్ టీం. అది సాధ్యం కాకపోవడంతో బొద్దు అనుష్కతోనే మిగిలిన పార్ట్ కంప్లీట్ చేశారు.

కానీ మూడేళ్ల క్రితం షూటింగ్ మొదట్లోనే.. దేవసేన లుక్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కత్తి తిప్పుతూ విన్యాసాలు చేసిన అనుష్క చాలా స్లిమ్ గా ఉంటుంది. ఇప్పుడు విడుదల చేసిన లుక్.. మూడేళ్ల క్రితంది కూడా అయుండచ్చని అంటున్నారు. రీసెంట్ గా షూట్ చేసిన పార్ట్ లోంచి అయితే.. ఇలాంటి లుక్ కష్టమే అన్నది వారి వాదన. అయితే.. గ్రాఫిక్స్ మాయాజాలంతో జక్కన్న ఎలాగైనా చూపించేయగలడులే అనేవాళ్లు కూడా ఉన్నారండోయ్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/