Begin typing your search above and press return to search.

ఏవండీ.. అనుష్క చేసి 9 నెలలైంది..

By:  Tupaki Desk   |   27 March 2016 6:52 AM GMT
ఏవండీ.. అనుష్క చేసి 9 నెలలైంది..
X
ఈ అభిమానులు ఉన్నారే.. వారు దేనికి ఫీల్‌ అవుతారో దేనికి హర్ట్‌ అవుతారో.. దేనికి రియాక్ట్‌ అవుతారో నిజంగానే గెస్‌ చేయలేం. ''ఊపిరి'' సినిమాను చూసిన 'బాహుబలి' ఫ్యాన్స్‌ ఇప్పుడు అనుష్క ఇంకా సన్నబడలేదు.. మా బాహుబలి 2017 లో వస్తుందా అసలు.. ఎందుకు ఈమె ఇలా లేట్‌ చేస్తోంది అంటూ తెగ ఫీలైపోతున్నారు. అయితే వారు ఇక్కడే అసలు లాజిక్‌ మిస్సయ్యారు.

గత సంవత్సరం.. జూలై 2015లో.. పారిస్‌ నగరంలో ఆ షూటింగులో పాల్గొంది అనుష్క. అంటే అప్పటికే ఆమె బాహుబలి షూటింగ్ పూర్తి చేసేసి.. సైజ్‌ జీరో షూటింగ్‌ కోసం లావెక్కే పనిలో ఉందనమాట. ఆ తరువాత సైజ్‌ జీరో చేసింది.. రిలీజైంది.. సన్నబడటం మొదలెట్టింది.. సూర్య సరసన సింగం 3 సినిమా కూడా చేసేసింది. 9 నెలల క్రితం అనుష్క షూటింగ్‌ చేసిన ఊపిరి ఎపిసోడ్‌ ను ఇప్పుడు చూసి ఖంగారుపడితే ఎలా? ఏమయ్యా అభిమానులూ.. ఆ లాజిక్‌ ఎలా మిస్సయ్యారు.

ఇప్పటికే సింగం 3 షూటింగ్‌ ను పూర్తి చేసుకున్న అనుష్క.. త్వరలోనే బాహుబలి లేటెస్టు షెడ్యూల్‌ లో జాయిన్ అవ్వనుంది. అయితే అందరూ అనుకున్నట్లు ఆమె వెయిట్‌ ఇంకా హెవీగా లేదండోయ్‌.. ఎప్పుడో సన్నబడింది.