Begin typing your search above and press return to search.

అనుష్క సంగతి.. వారంలో తేలుతుందిలే

By:  Tupaki Desk   |   3 Feb 2017 9:20 AM GMT
అనుష్క సంగతి.. వారంలో తేలుతుందిలే
X
సౌత్ బ్యూటీ అనుష్క శెట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ముఖ్యంగా సౌత్ లో ఈమె సైజ్ గురించి తెగ డిస్కషన్స్ జరిగిపోతున్నాయి. బాహుబలి2 చిత్రానికి రిపబ్లిక్ డే పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి.. స్వీటీ నిజంగా అంత సన్నగా మారిందా.. లేక ఇది కూడా రాజమౌళి చేసిన గ్రాఫిక్ మాయాజాలమా అన్నదానిపై తెగ చర్చలు జరుగుతున్నాయి.

అనుష్క బైట ఎక్కడా కనిపించకపోవడంతో.. ఈ సంగతిపై ఓ క్లారిటీ రావడం లేదు. కానీ అసలు నిజం ఏంటో తెలిసే అవకాశం వచ్చేస్తోంది. వచ్చే గురువారం.. అంటే ఫిబ్రవరి 9న సూర్యకు జోడీగా స్వీటీ నటించిన సింగం సిరీస్ మూడో భాగం ఎస్3 రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుష్క రూపం ఎలా ఉందో చూస్తే.. ప్రస్తుతం ఉన్న గెటప్ పై ఓ అంచనాకు వచ్చేయచ్చు. ఎస్3 షూటింగ్.. బాహుబలి2లో అనుష్క ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్.. దాదాపుగా ఒకే సమయానికి జరిగాయి.

వచ్చే వారం విడుదల కానున్న అనుష్క ఎలా కనిపిస్తే.. ఒరిజినల్ స్వీటీ అలా ఉన్నట్లుగా ఫిక్స్ అయిపోవచ్చు. నిజంగా సన్నబడిపోయి.. పాత రూపాన్ని సంతరించుకుంటే.. ఫ్యాన్స్ కి పండగే. కానీ లావుగా కనిపించదంటే మాత్రం.. బాహుబలి2 లో ఈమెను సన్నగా చూపించేసేందుకు ప్రత్యేకంగా గ్రాఫిక్స్ ఉపయోగించారనే విషయం తేలిపోతుంది. ఏమైనా అనుష్క సీక్రెట్ తేలేందుకు మరో ఆరు రోజులు మాత్రమే గ్యాప్ ఉందంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/