Begin typing your search above and press return to search.
అనుష్క లవ్ చేసింది ఆ హీరోనేనా..?
By: Tupaki Desk | 21 March 2020 10:22 AM GMTబాహుబలి సినిమాతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. కింగ్ నాగార్జున నటించిన 'సూపర్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కాగా, రీసెంట్ గా ఈ భామ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం బయటకు వచ్చింది. హీరోయిన్ల వ్యక్తిగత విషయాల పై ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు చెప్పండి. ఇక అది వారి ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయం అయితే, ఇంకేముంది ఆ విషయాన్ని వైరల్ చేసేస్తుంటారు. గతంలో అనుష్క ప్రేమలో ఉన్నట్లు ఒకసారి, డేటింగ్‌లో ఉందంటూ మరోసారి, పెళ్లి కుదిరిందంటూ ఇలా గాసిప్స్ చాలానే వచ్చాయి. అయితే వాటి పై అనుష్క పలుసార్లు వివరణ ఇచ్చినా ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ మాత్రం పడలేదు. అప్పట్లో బాహుబలి హీరో ప్రభాస్‌తో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఓ ప్రముఖ క్రికెటర్‌తో రిలేషన్‌షిప్ కొనసాగించిందని వార్తలు వచ్చాయి. ఇవి సరిపోవన్నట్లు దర్శకుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందన్న ఊహాగానాలు వినిపించాయి. మధ్యలో ఓ బిజినెస్ మ్యాన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిందన్న వార్తలూ వచ్చాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి పై వస్తున్న పుకార్ల పై స్పందించిన అనుష్క అసంతృప్తి వ్యక్తం చేసారు. తనకంటూ వ్యక్తిగత జీవితం ఉందని, అందులోకి కొందరు వేలుపెట్టే ప్రయత్నాలు నచ్చడం లేదన్నారు. తన ప్రేమ,పెళ్లి గురించి వదంతులు ప్రచారం చేసేవారందరికి తానూ ఒకప్పుడు ప్రేమలో పడినట్లు తెలిపారు. 2008లో ఓ వ్యక్తిని ప్రేమించానని, అది తీయని ప్రేమ అని పేర్కొన్నారు. అయితే ఆ ప్రేమ కొనసాగలేదని, కొన్ని అనివార్య పరిస్థితుల్లో విడిపోయామని చెప్పారు. తాను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరన్నది చెప్పడం ఇష్టం లేదని అనుష్క తెలిపారు. అలాగే ప్రభాస్ తాను మంచి స్నేహితులమని అన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అనుష్క అప్పట్లో ఎవరిని లవ్ చేసింది అనే విషయం మీద చర్చ జరుగుతోంది. అనుష్క లవ్ చేసింది టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ హీరోనే అని అనుకుంటున్నారు. అప్పట్లో వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటించారట. అప్పట్లో ఆ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నారనే వార్త హల్ చల్ చేసిందంట.
కాగా, అనుష్క ప్రస్తుతం మాధవన్ తో కలిసి నటించిన 'నిశ్శబ్దం' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అనుష్క బాహుబలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 'నిశ్శబ్దం' మూవీ అనుష్కా శెట్టికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.