Begin typing your search above and press return to search.
సవ్యసాచి విలన్ తో అనుష్క నెక్ట్స్?
By: Tupaki Desk | 23 May 2018 8:53 AM GMTహేమంత్ మధుకర్.. ఒక డైరెక్టర్ గానే కాకుండా, ఒక రైటర్ గా కూడా మనకు కొంత పరిచయమే. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన వస్తాడు నా రాజు సినిమాకు స్క్రిప్ట్ రాసింది మరియు దర్శకత్వం వహించింది కూడా ఇతనే. హేమంత్ ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాడు. అంతే కాదండోయ్ ఆ సినిమాలో స్టార్ కాస్ట్ ని పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
భాగమతి సినిమాతో మరిచిపోలేని సూపర్ హిట్ అందుకున్న మన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా సైన్ చేయకపోయినా, స్క్రిప్ట్ తనకు బాగా నచ్చింది అని కాబట్టి ఒప్పుకునే అవకాశాలు బాగానే ఉన్నాయి అంటూ ప్రొడక్షన్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. అంతే కాదండోయ్ మొన్ననే బ్రీత్ వెబ్ సిరీస్ లో కనిపించి, ఇప్పుడు సవ్యసాచి సినిమాలో కూడా విలన్ గా ముఖ్యపాత్ర పోషించనున్న తమిళ యాక్టర్ మాధవన్ కు కూడా ఈ సినిమాలో ఒక పెద్ద పాత్రను ఆఫర్ చేశారట.
దాదాపుగా మాధవన్ కూడా కంఫర్మ్ అయిపోయినట్టే అని దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు. థ్రిల్లర్ గా రూపు దిద్దుకోనున్న ఈ సినిమా లోకి హాలీవుడ్ యాక్టర్లను మరియు టెక్నిషియన్లను కూడా తీసుకొచ్చేందుకు హేమంత్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ స్టాండర్డ్స్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.