Begin typing your search above and press return to search.

కృష్ణంరాజు క‌డ‌చూపు.. ప‌రామ‌ర్శ‌లో అనుష్క‌

By:  Tupaki Desk   |   12 Sep 2022 4:34 AM GMT
కృష్ణంరాజు క‌డ‌చూపు.. ప‌రామ‌ర్శ‌లో అనుష్క‌
X
రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. అది అభిమానుల‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం సినీరాజ‌కీయ రంగాల నుంచి ప్ర‌ముఖులంతా నివాళులు అర్పించారు. ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. ప్ర‌ముఖులంతా ప్ర‌భాస్ కు వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసారు. అయితే ఆ స‌మ‌యంలో ప్ర‌భాస్ స్నేహితురాలు అనుష్క ఎక్క‌డ‌ ఉన్నారు? ప్రభాస్ కి అండ‌గా క‌నిపించ‌లేదు..! అన్న ప్ర‌శ్న త‌లెత్తింది.

అయితే అనుష్క ఈ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టంలో త‌న స్నేహితుడైన ప్ర‌భాస్ కి మోర‌ల్ స‌పోర్ట్ నిచ్చారు. త‌న‌కు అండ‌గా నిలిచారు. ఆస్ప‌త్రిలో ప్ర‌భాస్ కి అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందించారు. అంతేకాదు కృష్ణంరాజు మ‌ర‌ణానంత‌రం అనుష్క‌ సోష‌ల్ మీడియాల్లో తీవ్ర ఆవేద‌న‌ను వెలిబుచ్చారు.

లెజెండ్ కృష్ణంరాజు గారిని కోల్పోవ‌డం తీర‌ని లోటు అని వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేసింది. అంతేకాదు.. కృష్ణంరాజును పరామర్శించడానికి అనుష్క శెట్టి కూడా ఆసుపత్రికి వచ్చినట్లు ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

అనుష్క ప్రభాస్ తో కలిసి న‌టించ‌డ‌మే కాదు.. త‌న‌ కుటుంబంతో సన్నిహిత బంధాన్ని కొన‌సాగించారు. బిల్లాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ నటించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో కృష్ణంరాజు కూడా కీలక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత రుద్ర‌మ‌దేవిలో కృష్ణంరాజుకు కూతురు పాత్ర‌లో అనుష్క న‌టించింది. కృష్ణంరాజు గ‌ణ‌ప‌తిదేవ చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌లో న‌టించ‌గా అత‌డి కుమార్తె రుద్ర‌మ‌దేవిగా అనుష్క న‌టించింది.

అనుష్క హైద‌రాబాద్ గ‌చ్చిబౌళిలోని ప్ర‌యివేట్ ఆస్ప‌త్రిలో క‌నిపించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇక అనుష్క కంటే ముందే అదే ఆస్ప‌త్రిలో డార్లింగ్ ప్రభాస్ త‌న పెద‌నాన్న‌ను సంద‌ర్శించేందుకు వెళుతున్న వీడియోలు ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి.

క‌ష్ట కాలంలో జేజ‌మ్మ అనుష్క త‌న స్నేహితుడు ప్ర‌భాస్ కి అండ‌గా నిలిచార‌ని దీనిని బ‌ట్టి అభిమానుల‌కు అర్థ‌మైంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా మంచి స్నేహం ఇరుకుటుంబాల న‌డుమా స్నేహానుబంధం ఎంతో గొప్ప‌గా ఆవిష్కృత‌మైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.