Begin typing your search above and press return to search.

20+ కుర్రోడితో 40+ ఆంటీ రొమాన్స్..?

By:  Tupaki Desk   |   24 March 2021 3:30 AM GMT
20+ కుర్రోడితో 40+ ఆంటీ రొమాన్స్..?
X
దక్షిణాది అగ్ర కథానాయిక అనుష్క - యువ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 'రా రా కృష్ణయ్య' ఫేమ్ పి.మహేష్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనుందని సమాచారం ఇటీవలే 'జాతిరత్నాలు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్ బంపర్ ఆఫర్ కొట్టాడని అందరూ అనుకున్నారు. అలానే తనకంటే వయసులో పెద్దదైన అనుష్క తో ఎలా ఆన్‌ స్క్రీన్ రొమాన్స్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నేపథ్యం గురించి ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. 20 ప్లస్ ఏజ్ ఉన్న కుర్రోడితో 40 ప్లస్ ఏజ్ లో ఉన్న మహిళ ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ రొమాంటిక్ డ్రామా రూపొందనుందట. దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడం.. దాని వల్ల వాళ్లు ఎదుర్కొనే పరిమాణాలు ఇందులో చూపించనున్నారంటూ టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ తరహా బి గ్రేడ్ సినిమాలు చాలానే వచ్చాయని చెప్పవచ్చు. మరి అనుష్క - నవీన్ పోలిశెట్టి లాంటి వారితో ఎలా తీస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా గురించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.