Begin typing your search above and press return to search.

నిశబ్దం : ఓటీటీకి మెగ్గు చూపేలా ఆయన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   3 May 2020 12:10 PM GMT
నిశబ్దం : ఓటీటీకి మెగ్గు చూపేలా ఆయన వ్యాఖ్యలు!
X
కరోనా లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌ అన్ని పరిశ్రమలపై భారీగా ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీపై దారుణంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్‌ నుండి హాలీవుడ్‌ వరకు అన్ని చోట్ల ఫిల్మ్‌ మేకింగ్‌ ఆగిపోవడంతో పాటు సినిమాల విడుదల కూడా స్థంభించి పోయాయి. ఇండియాలో ఈ సమ్మర్‌ లో హాలీడేస్‌ కావడం వల్ల వందలాది సినిమాలు విడుదల అయ్యేవి. కాని కరోనా కారణంగా మొత్తం పరిస్థితి తారు మారు అయ్యింది. విడుదల మరో వారం పది రోజుల్లో అనుకుంటూ ఉండగా లాక్‌ డౌన్‌ ప్రకటన రావడంతో ఆ సినిమాల మేకర్స్‌ తీవ్ర సంఘర్షణకు గురవుతున్నారు.

థియేటర్ల పున: ప్రారంభంకు చాలా సమయం పడుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే ఈ ఏడాది సినిమాపై సినిమా పరిశ్రమ ఆశలు వదిలేసుకోవాల్సిందే అంటూ కొందరు అంటున్నారు. ఈ సమయంలోనే కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్‌ సిద్దం అవుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్‌ అయ్యాయి. లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న కారణంగా మరిన్ని సినిమాలు ఓటీటీలో రాబోతున్నాయి. అనుష్క చాలా గ్యాప్‌ తర్వాత నటించిన నిశబ్దం చిత్రంను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా మొన్న వరకు వార్తలు వచ్చాయి.

తాజాగా ఆ వార్తలపై దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ స్పందిస్తూ.. మమ్ములను ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ వారు సంప్రదించారు. అయితే ఇంకా సినిమా వర్క్‌ పూర్తి కాలేదు. తెలుగు ఫస్ట్‌ కాపీ రెడీ అయినా తమిళం.. కన్నడం.. మలయాళం వర్షన్‌ లు రెడీ కాలేదు. వాటి వర్క్‌ పూర్తి అయిన తర్వాత అప్పటికి కూడా థియేటర్లు ఓపెన్‌ కు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే అప్పుడు ఓటీటీ రిలీజ్‌ గురించి ఆలోచిస్తాం.

ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. కాని ఆయన మాటలను బట్టి చూస్తుంటే థియేటర్లు ఇప్పట్లో ఓపెన్‌ అయ్యే పరిస్థితి లేకుంటే ఓటీటీకి మొగ్గు చూపే అవకాశం ఉందన్నట్లుగా ఉన్నాయి. మరి నిశబ్దం ప్రేక్షకులను బుల్లి తెరపైన ఎంటర్‌ టైన్‌ చేయనుందా లేదంటే వెండి తెరపైనే మైమరపించనుందో చూడాలి.