Begin typing your search above and press return to search.

సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?

By:  Tupaki Desk   |   1 April 2020 2:30 PM GMT
సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?
X
మన టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. ఒక్కొక సినిమాకి రెండు నుండి మూడు కోట్లు తీసుకునే స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. కొంతమంది హీరోయిన్లు ఒక్క ఐటమ్ సాంగ్ చేస్తేనే కోటి రూపాయల దాకా డిమాండ్ చేస్తుంటారు. గెస్ట్ రోల్స్ చేయడానికి వాళ్ళు వసూలు చేసేది లక్షల్లోనే. ఇంత భారీ మొత్తంలో సంపాదించే హీరోయిన్లు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఇప్పుడు సగటు అభిమానికి వస్తున్న డౌట్. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తం వ్యాపించింది. ఈ వైర‌స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా త‌న పంజాను చూపెడుతోంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వాలు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ లోని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు హీరోలు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. కానీ ప్రణీత - లావణ్య త్రిపాఠి మినహా మిగతా హీరోయిన్లు స్పందించక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అనుష్క లాంటి వారు కూడా స్పందించకపోవడంతో అభిమానులు ఆమె పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అనుష్క తను నటించబోయే సినిమాలకి గట్టిగానే వసూలు చేస్తూ ఉంటుంది. విడుదలకు సిద్ధంగా ఉన్న నిశ్శబ్దం సినిమాకి కూడా భారీగా తీసుకుందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఈ భామ రాష్ట్రం ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు స్పందించడం లేదంటూ, అనుష్క కి సామాజిక బాధ్యత లేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కానీ కొందరు విరాళాలు ప్రకటించినప్పటికీ దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేకనో, ఇంకేదైనా కారణం చేతనో వాళ్ళు బయటికి చెప్పరు, అంత మాత్రానా వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని - అనుష్క కూడా వారిలో ఒకరేమో అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న హీరోయిన్లను అభినందించాలి.