Begin typing your search above and press return to search.
సినిమాలే వద్దనుకున్న అనుష్క
By: Tupaki Desk | 25 Jan 2018 12:12 PM GMTభాగమతి భామ అనుష్క మాట్లాడేది చాలా తక్కువ అనుకుంటాం కాని ఒక్కసారి ఓపెన్ అయితే మాత్రం సాదాసీదా విషయాలు కాకుండా కొంచెం షాకిచ్చె మాటలే చెబుతుంది. భాగమతి ప్రమోషన్స్ కోసం విస్తృతంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న అనుష్క మొదట్లో తనకు సినిమాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదని చెప్పి ఝలక్ ఇచ్చింది. కాని ఇప్పుడు కాదట. యాక్టింగ్ అంటే ఏంటో తెలియని స్టేజిలో సూపర్ సినిమా ఆడిషన్ కోసం హైదరాబాద్ వచ్చిన అనుష్క మనసులో సెలెక్ట్ అవ్వాలి అనే బలమైన లక్ష్యం ఏది లేకుండానే దానికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే తనను టెస్ట్ చేయడానికి పూరి జగన్నాధ్ - నాగార్జున - సుప్రియ సిద్ధంగా ఉన్నారు. ఎలాగోలా అది ఓకే అయ్యింది. సినిమా రిలీజ్ అయిపోయింది. అవకాశాలు వచ్చాయి కాని పెద్దగా ఇష్టం లేకుండానే కొన్ని సినిమాలు చేసేసింది.
ఇక చివరి సినిమాగా అరుంధతి ఒక్కటి చేసి పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలి అనుకున్నప్పుడు ఆ సినిమా సాధించిన ఘన విజయం, రాసిన చరిత్ర - తెచ్చిన పేరు తనను ఇక ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఆపేశాయి. ఒకవేళ అరుంధతి ఆఫర్ కనక అప్పుడు రాకపోయి ఉంటే ఇప్పుడు బాహుబలి దేవసేనగా మరొకరిని చూడాల్సి వచ్చేదేమో. అంతా దేవుడి మహిమే తప్ప ఏమి లేదని ఇదంతా వివరంగా చెప్పుకొచ్చింది అనుష్క. అరుంధతి ముందు వరకు పది పన్నెండు సినిమాలు చేసిన అనుష్క అవేవి సంతృప్తిని ఇవ్వకపోవడంతో వెళ్ళిపోదాం అనుకుందట.
సినిమా పరిశ్రమలో అంతే. ఒక్క సినిమా రాత్రికి రాత్రే జాతకాలు మార్చేస్తుంది. అప్పటి దాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనే తరహాలో జరిగిపోతాయి అన్ని. 1990వరకు హీరోల పక్కన గ్లామర్ పాత్రలు వేసిన విజయశాంతి ఒక్క కర్తవ్యం సినిమాతో లేడీ అమితాబ్ అనే రేంజ్ కు చేరుకున్నారు. దాని తర్వాత ఆవిడ ఇమేజ్ సైతం మారిపోయింది. ఏదైతేనేం అరుంధతి పుణ్యమా అని అనుష్క మరో పదేళ్ళకు పైగా సినిమాలు చేసే అవకాశం దక్కింది. అన్నట్టు స్వీటీకి ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడం అంటే మహా చిరాకట. నిజమే సుమా. అవార్డు ఫంక్షన్స్ లో రెడ్ కార్పెట్ మీద అనుష్క స్టిల్స్ ఇవ్వడం చాలా అరుదుగా చూస్తాం.