Begin typing your search above and press return to search.

స్వీటీ లైపో న్యూస్.. ప్ర‌మోష‌న్ కోస‌మే?

By:  Tupaki Desk   |   29 Sep 2015 5:30 PM GMT
స్వీటీ లైపో న్యూస్.. ప్ర‌మోష‌న్ కోస‌మే?
X
స్వీటీశెట్టి అలియాస్ అనుష్క శెట్టి ఇటీవ‌లి కాలంలో గుండ్రంగా గుమ్మ‌డిపండులా క‌నిపిస్తోంది క‌దూ? సైజ్ జీరో పోస్ట‌ర్లు చూశాక బాపురే.. అస‌లు ఈవిడే ఆవిడా? అని స్ట‌న్ అయిపోయాం క‌దూ? అదంతా మేక‌ప్ జిమ్మిక్కు అని తెలిసి కూడా ఇంకా న‌మ్మ‌న‌ట్టే ఉన్నాం అంతా. అయితే అనుష్క‌పై లేటెస్టుగా కొన్ని రూమ‌ర్లు టాలీవుడ్‌ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అనుష్క సైజ్ జీరో టైమ్‌ లో డ‌బుల్ బ‌రువు పెరిగింది. దాదాపు 20 కేజీల వెయిట్ పెంచింది. దీనివ‌ల్ల గుమ్మ‌డి పండు రూపంలోకి మారిపోయింది. ఇప్పుడు తిరిగి పాత రూపం ర‌ప్పించాలంటే దానికోసం యోగా చేస్తే స‌రిపోవ‌డం లేదు. జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేసినా ప్ర‌యోజ‌నం లేదు. అందుకే లైపో చేయించుకో్వ‌డానికి సింగ‌పూర్ లేదా మ‌లేషియా వెళ్ల‌బోతోంద‌ని ప్ర‌చారం సాగిస్తున్నారు. అయితే అస‌లు స్వీటీకి అంత అవ‌స‌రం ఏం క‌నిపించ‌డం లేదు. ఇదంతా త‌న సినిమాల ప్ర‌మోష‌న్ కోసం చేస్తున్న జిమ్మిక్కు మాత్ర‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది.

అనుష్క ఓవ‌ర్ వెయిట్ కేవ‌లం సైజ్ జీరో కోసం పెరిగిందే కాదు, కాల‌క్ర‌మంలో 30కి చేరువ‌వుతున్న క్ర‌మంలో వ‌య‌సుతో పాటే వ‌చ్చిన‌దే. కాబ‌ట్టి లైపో వ‌ల్ల ప‌న‌వ్వ‌దు. అయినా ఇప్ప‌టికిప్పుడు రుద్ర‌మ‌దేవి 3డి - సైజ్ జీరో సినిమాల‌కు ప్ర‌మోష‌న్ కావాలంటే ఇలాంటి వార్త‌ల‌యితేనే కిక్కిస్తాయ‌ని ప‌బ్లిసిటీ జిమ్మిక్కు రాయుళ్లు భావిస్తున్నారేమో!