Begin typing your search above and press return to search.

అహంకారిపై పైచేయి కోసం అనుష్క‌

By:  Tupaki Desk   |   12 Dec 2022 1:30 AM GMT
అహంకారిపై పైచేయి కోసం అనుష్క‌
X
అనుష్క శర్మ -విరాట్ కోహ్లీ దంప‌తులు ఆద‌ర్శ‌జంట‌గా అభిమానుల గుండెల్లో కొలువై ఉన్నారు. నేడు (11డిసెంబ‌ర్‌) తమ 5వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కానీ ఈ జంట అన్యోన్య‌త గురించి అభిమానుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తాజాగా అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్న ఈ జంట ఫోటోగ్రాఫ్ హాట్ టాపిక్ గా మారింది.

విరుష్క‌ జంట న‌డుమ ఓ గ‌మ్మ‌త్త‌యిన సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. ఇటీవ‌లే ఈ జంట‌ పండంటి ఆడ‌బిడ్డ వామిక‌కు ఈ జంట జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. వామిక తో విరుష్క ఆనందానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. కానీ ఒకప్పుడు అనుష్క విరాట్ తో అహంకారపూరితంగా ప్రవర్తించాన‌ని తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపింది. అయితే తాను అలా ఎందుకు ప్ర‌వ‌ర్తించాల్సి వ‌చ్చింది? అంటే..విరాట్ కూడా అహంకారిగానే ఉన్నాడని వివ‌ర‌ణ ఇచ్చింది.

అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ ఎవ‌రికి వారు విభిన్న రంగాల్లో రాణించిన సెల‌బ్రిటీలు. ముఖ్యంగా క్రికెట్- సినిమా వంటి వినోద పరిశ్రమల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంట‌గా పాపుల‌ర‌య్యారు. అయితే వీరిద్దరు మొదటిసారి ఎలా కలిశారు? అనే కథ కూడా అంతే పాపులర్. నిజానికి ఈ జంట ప‌రిచ‌యం చాలా సినిమాటిక్ గా మొద‌లైంది. మొదట్లో విరాట్ త‌న‌కు 'అహంకారి'గా కనిపించాడ‌ని అనుష్క తెలిపింది. దానివ‌ల్ల తాను కూడా అలానే ప్ర‌వ‌ర్తించాల్సి వ‌చ్చింద‌ని వెల్లడించింది.

2013లో ఒక‌ షాంపూ కమర్షియల్‌ షూటింగ్ లో అనుష్క- విరాట్ లు తొలిసారిగా కలిశారు. వెంట‌నే డేటింగ్ పుకార్లు మొద‌ల‌య్యాయి. ఈ జోడీ డిసెంబర్ 2017లో ఇటలీలోని లేక్ కోమోలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. 2021లో తల్లిదండ్రులుగా మారారు. కుమార్తె వామికతో ఆశీర్వాదం పొందారు.

మొదటిసారిగా విరాట్ ను ఎలా కలిశారనే దాని గురించి గ‌తంలో ప్ర‌ఖ్యాత‌ ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ తో అనుష్క మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌పై ఓపెనైంది.. ''న‌న్ను ఎవ‌రైనా అడిగితే... విరాట్ నా ఇంటికి వచ్చాడా? అంటే - అవును. అతను నా స్నేహితుడా? అంటే- అవును. అతను నాకు తెలుసా? అంటే- అవును'' అని చెబుతాను. కానీ ప్రజలకు తెలియని ఇతర విష‌యాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి ఓ యాడ్ చేశాం. అతను కూడా అహంకారి అని తెలిసినందున నేను అహంకారంతోనే ప్ర‌క‌ట‌న‌లో న‌టించేందుకు ముందుకొచ్చాను.. అంటూ న‌వ్వేసింది అనుష్క‌.

''విరాఠ్ మొండిగా వ్యవహరిస్తే త‌న‌పై నేను పైచేయి సాధించాలనుకున్నాను. కానీ నేను అతడిని ప్ర‌క‌ట‌న‌లో న‌టించేందుకు కలిసినప్పుడు చాలా లైట‌ర్ గా తెలివిగా ఫన్నీగా క‌నిపించాడు. టీవీ ప్ర‌క‌ట‌న కోసం మూడు రోజుల షూటింగ్ చేయాల్సి ఉంది. మొద‌టి రోజు చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈలోగానే రెండవ రోజు రాత్రి నా కొత్త ఇంటి ప్ర‌వేశ వేడుక‌ను జరుపుకోవడానికి నా స్నేహితులను భోజనానికి పిలిచాను. నేను అతని(విరాట్‌)ని కూడా ఆహ్వానించాను'' అని తెలిపారు. మా ప‌రిచ‌యం ఎక్కడ మొదలైంది? అంటే ఇతరుల‌కు తెలిసే జ‌రిగింది. కానీ మేం అంత‌కుముందు హెడ్ లైన్స లోకి రాలేదు అంతే!'' అని అనుష్క‌ చెప్పింది. అనుష్క శర్మ- విరాట్ కోహ్లి వైవాహిక జీవితం ఈ ఆదివారంతో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లక్షలాది మంది అభిమానులు అత్యంత ప్రియమైన జంట‌కు సోష‌ల్ మీడియాల్లో శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావడానికి అనుష్క సిద్ధమైంది. త‌దుప‌రి చిత్రం 'చక్దా ఎక్స్‌ప్రెస్' చిత్రీకర‌ణ‌లోను బిజీగా ఉంది. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా స్పోర్ట్స్ బయోపిక్ గా తెర‌కెక్కుతోంది. ఇది 2021లో తల్లి అయిన తర్వాత అనుష్క న‌టిస్తున్న‌ మొదటి పూర్తి నిడివి చిత్రం. చక్దా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుంది. ఇది స్ట్రీమింగ్ ప్రపంచంలో అనుష్క తొలి ప్రయ‌త్న‌మిద‌ని చెప్పాలి. త‌ను న‌టించిన‌ చివరి చిత్రం షారుఖ్ ఖాన్ తో ఆనంద్ ఎల్ రాయ్ 'జీరో'. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన 'ఖలా'లో అతిధి పాత్రలో కనిపించింది. ఇందులో త్రిప్తి డిమ్రీ - బాబిల్ ఖాన్ త‌దిత‌రులు న‌టించారు. విరాట్ కోహ్లీ విదేశీ షెడ్యూళ్ల‌తో బిజీగా ఉన్న సంగ‌తి విధిత‌మే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.