Begin typing your search above and press return to search.
గుండెలపై బరువుంటే నిద్ర పోలేం
By: Tupaki Desk | 23 Sep 2016 9:30 AM GMTటాలీవుడ్ కి స్వీటెస్ట్ స్వీటీ అనుష్క. అరుంధతితో స్టార్ట్ చేసి ఇప్పటివరకూ అలరిస్తూనే ఉంది. అటు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలను.. ఇటు కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేసేస్తూ.. బోలెడన్ని ప్రశంసలు దక్కించుకుంది. అయితే.. ఎన్ని పొగడ్తలు వచ్చాయో.. అంతకంటే ఎక్కువగా ఈమెపై రూమర్లు కూడా వచ్చాయి. తనపై వచ్చే వార్తలు.. గాసిప్పులపై అనుష్క రియాక్ట్ అయిన తీరు అందరినీ ఆలోచింప చేసింది.
'ప్రపంచం నా గురించి ఏం అనుకుంటోందో అని ఆలోచించే మెంటాలిటీ నాకు లేదు. వాళ్లేం అనుకుంటున్నారో.. వీళ్లేం ఆలోచిస్తున్నారో అని ఆలోచించి బెంగ పెట్టుకుంటే.. ప్రతీ రోజూ ఏడుస్తూనే ఉండాల్సొస్తుంది' అని చెప్పింది అనుష్క. అయితే ఇలా కల్లబొల్లి కబుర్లు రాసే రూమర్ల కారణంగా.. వ్యక్తిగత జీవితంలో కొంత బాధ పడ్డ మాట వాస్తవమేనన్ని స్వీటీ.. 'రాసేవాళ్లు రాస్తుంటారు. అలాగని ఏడుస్తూ ఉండిపోను. కొంత బాధపడి.. ఇలా రాశారేంటి అనుకుంటాను. కానీ అది కొంతసేపే' అంటోంది స్వీటీ.
'గుండెలపై బరువుంటే కనీసం నిద్ర కూడా పట్టదు. అందుకే పడుకోబోయే ముందు కాసేపు కూడా మనసులో గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. తప్పుచేసిన వారికే తప్ప.. నాకు ఆ ఫీలింగ్ అసలు రాదు. ఆ టైపు ఆలోచనలేవీ దగ్గరకు రానివ్వను. అందుకే ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నా' అంటోంది బాహుబలి భామ.