Begin typing your search above and press return to search.
మోషన్ పోస్టర్: కల్లోకి వస్తుందేమో
By: Tupaki Desk | 10 Jan 2018 1:25 PM GMTపెళ్ళయిన తరువాత అసలు అనుష్క శర్మ ఎలాంటి సినిమాలు చేస్తుందా అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటే.. ఒక ప్రక్కన షారూఖ్ ఖాన్ తో జీరో వంటి కమర్షియల్ సినిమా.. మరో ప్రక్కన సల్మాన్ తో ఒక సినిమా.. అన్నట్లుంది ఆమె యవ్వారం . అయితే ఈ మధ్యలో ఆమె ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒకటి కూడా రాబోతోంది. ఆ సినిమాతో మాత్రం.. ఖచ్చితంగా ఆమె అందరికీ కల్లోకి వస్తుందనే చెప్పాలి.
అసలు అనుష్క రేంజ్ గ్లామర్ అంటే.. ఎవరికైనా కల్లోకి వస్తుందిలే.. అందుకేగా ఆమెను విరాట్ కొహ్లీ టక్కున పెళ్ళి చేసేసుకున్నాడు అనేవారూ లేకపోలేదు. కాని మనం మాట్లాడుతోంది అలా కల్లోకి రావడం గురించి కాదులే. నిజానికి అనుష్క ఇప్పుడు 'పరి' అనే సినిమాలో నటిస్తూ.. తానే ఆ సినిమాను ప్రొడ్యూస్ కూడా చేస్తోంది. బెంగాళి డైరక్టర్ ప్రొసిత్ రాయ్.. ఈ సినిమా తాలూకు మోషన్ పోస్టర్ వంటి టీజర్ ఒకటి రిలీజ్ చేసి ఇప్పుడు షాకిచ్చాడు. క్యూట్ గా కనిపించే అనుష్క మొహంపై దెబ్బలు.. తరువాత గాయాలు.. రక్తం.. కళ్లు కూడా ఎరుపెక్కి నెత్తురు కక్కడం.. వామ్మో.. ఆ సింగిల్ షాటును చూస్తే చాలు.. అనుష్క కలలోకి వచ్చేంత రేంజులో భయపెట్టేసింది.
ఇకపోత ఫిబ్రవరి 9న రిలీజవ్వాల్సిన ఈ సినిమా.. మార్చి 2న హోళీ పండుగనాడు రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. అయితే ''Not a Fairy tale'' అంటూ ట్యాగ్ లైన్ తగిలించారు కాని.. అసలు ఈ రేంజు రచ్చ చూశాక ఈ సినిమాను దీనిని ఎవరైనా అద్భుతమైన ఫాంటసీ కథ అనుకుంటారా? అస్సలు అనుకోరు.