Begin typing your search above and press return to search.

అనుష్క ఫొటో.. అంద‌రి చూపు వాటిమీద‌నే!

By:  Tupaki Desk   |   6 Jun 2021 7:30 AM GMT
అనుష్క ఫొటో.. అంద‌రి చూపు వాటిమీద‌నే!
X
వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్ షిప్ కోసం టీమిండియా ఇంగ్లండ్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. క్వారంటైన్ పూర్తిచేసుకున్న త‌ర్వాత‌ జూన్ 2న విమానం ఎక్కింది టీమ్. అయితే.. వీరితోపాటు కుటుంబ స‌భ్యులు కూడా వెళ్లారు. అక్క‌డ దిగిన త‌ర్వాత ఆ దేశంలోని నిబంధ‌న‌ల ప్ర‌కారం క‌ఠిన క్వారంటైన్లో ఉంది టీమిండియా. కుటుంబ స‌భ్యుల‌ను కూడా ఒక‌రినొక‌రు క‌లుసుకునే వీళ్లేదు. ఇలా మూడు రోజులు గ‌డ‌పాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలో నిన్న (శ‌నివారం) సోష‌ల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ‌. వెనుక సౌతాంప్ట‌న్ లోని క్రికెట్ స్టేడియం క‌నిపిస్తుండ‌గా.. చిరున‌వ్వులు చిందిస్తోంది అనుష్క‌. అంతేకాదు.. దానికి ఒక కామెంట్ కూడా జ‌త చేసింది. ‘‘పనిని ఇంటికి తీసుకురావొద్ద అన్న నిబంధన కొన్నాళ్లపాటు కోహ్లీకి వర్తించదు’’ అని రాసుకొచ్చింది. ‘క్వారంటైన్ ఎట్ ది స్టేడియం’ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జతచేసింది.

అయితే.. అందరి చూపుమాత్రం అనుష్క ఫొటోలోని చెప్పుల మీద‌నే ప‌డింది. వైట్ స్వెట‌ర్ టీష‌ర్ట్ ధ‌రించిన బ్యూటీ.. గూచీ బ్రాండ్ చెప్ప‌ల్స్ వేసుకుంది. చూడ్డానికి ఇవి చాలా బాగున్నాయి. దీంతో.. అంద‌రూ వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మోడ‌ల్ కోసం ఆన్లైన్లో వెతికేస్తున్నారు కూడా. వాటి ధ‌ర ఎంతో తెలుసా? 31,890 రూపాయలు!