Begin typing your search above and press return to search.

ఇండైరెక్ట్ గా పెళ్లి గురించి అడగొద్దు.. అంటున్న స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   1 May 2020 2:30 AM GMT
ఇండైరెక్ట్ గా పెళ్లి గురించి అడగొద్దు.. అంటున్న స్టార్ హీరోయిన్
X
తెలుగు చిత్ర పరిశ్రమకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా పరిచయమయింది బెంగళూరు భామ అనుష్క శెట్టి. అయితే తొలి సినిమాతో తన ఆకట్టుకునే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనుష్క, ఆ తర్వాత మెల్లగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. కొంతకాలానికే అరుంధతి సినిమా అవకాశం రావడం, ఇక ఆ సినిమాలో ఆమె అద్భుతమైన నటనతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమాతో ఎన్నో గొప్ప రికార్డులు కూడా నెలకొల్పింది. ఎన్నో అవకాశాలుతో దూసుకెళ్లిన అనుష్క బాహుబలి సినిమాలతో గొప్ప పేరు, క్రేజ్ ను పొంది మరో స్థాయికి ఎదిగింది. ఇక కొన్నేళ్లుగా అనుష్క అభిమానులు ఎదురుచూస్తున్న ముచ్చట అనుష్క పెళ్లి.

అనుష్కకి సంబంధించిన పెళ్లి రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు ప్రభాస్ తో అని, మరోవైపు క్రికెటర్ తో అని ఇలా రోజుకో వార్త క్రియేట్ అవుతుంటే.. చాలా ఇంటర్వ్యూలలో అనుష్క ప్రభాస్ ఆ పుకార్లకు చెక్ పెడుతూనే ఉన్నారు. అయినా సరే పుకార్లు ఆగకపోవడంతో ఈ మధ్యే ప్రభాస్ ఒక స్ట్రాంగ్ ఆన్సర్ కూడా ఇచ్చాడు. రూమర్స్ ఆగిపోవాలి అంటే.. మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ముందు పెళ్లి కావాలని చెప్పాడు. ఆ దెబ్బతో ప్రభాస్ ఆలోచన విధానం పై అందరికి ఒక క్లారిటీ వచ్చింది. అనుష్క వయసు ఇప్పుడు 38 సంవత్సరాలు. మరో రెండేళ్లయితే 40కి రీచ్ అవుతుంది. ఈ వయసులో ఆమె పెళ్లి గురించి ఎందుకు ఆలోచించడం లేదని అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. అయితే అనుష్క ప్రస్తుతం తన తదుపరి సినిమా ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తుందట. పెళ్లి మ్యాటర్ లో ఆమె ప్రభాస్ ని ఫాలో అవుతోందట. ఇంకొన్ని మంచి సినిమాలు చేయాలని మరికొన్ని రోజులు పెళ్లిని వాయిదా వేసుకుంటోందని టాక్ చూడాలి మరి అమ్మడి నుండి ఎలాంటి కబురు వినిపిస్తుందో..!