Begin typing your search above and press return to search.
అనుష్కకే నాలుగు కోట్లిస్తే..
By: Tupaki Desk | 26 Jun 2015 3:00 PM ISTసౌత్‌లో హీరోయిన్లు ఎంత స్టార్‌డమ్ సంపాదించినా.. వాళ్ల రెమ్యూనరేషన్ అమాంతంగా ఏమీ పెరిగిపోదు. మన స్టార్ హీరోలంతా పది కోట్ల మార్కుకు అటు ఇటుగా ఉంటే.. హీరోయిన్లు మాత్రం కోటి-రెండు కోట్ల మధ్యే రౌండ్లు కొడుతున్నారు. ఏ హీరోయిన్ అయినా రెండు కోట్లు పారితోషకంగా తీసుకుందన్నా అది పెద్ద వార్తే. ఇలాంటి సమయంలో ఓ తెలుగు సినిమాకు హీరోయిన్ నాలుగు కోట్ల పారితోషకం తీసుకుందంటే నమ్మగలమా? ఆ రికార్డు మన జేజెమ్మ అనుష్కదే. ఆ సినిమా మరేదో కాదు.. బాహుబలి.
మామూలుగా ఓ పెద్ద సినిమాకు మహా అయితే రెండు మూడు నెలలు కాల్‌షీట్స్ ఇస్తారు హీరోయిన్లు. కానీ 'బాహుబలి' సినిమా కోసం తక్కువలో తక్కువగా ఆరు నెలలు షూటింగ్‌లో పాల్గొందట అనుష్క. ఇంకా రెండో పార్ట్ కోసం ఇంకొన్ని నెలలు కేటాయించాల్సి ఉంది. రెండు పార్టులు కలుపుకుంటే తమన్నా కంటే అనుష్క ఎక్కువ రోజులు పని చేసింది. ఆమె రేంజి కూడా ఎక్కువే కాబట్టి మొత్తంగారూ.4 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారట అనుష్కకు. ఐతే అనుష్కకే ఇంతిస్తే మరి ప్రభాస్‌కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మనోడి లెక్క 20 నుంచి 25 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. ఈ లెక్కన రెమ్యూనరేషన్స్ అన్నీ లెక్కబెడితే.. 40-50 కోట్లకు తక్కువుండక పోవచ్చు. బాహుబలి బడ్జెట్ రూ.250 కోట్లకు ఎందుకు చేరిందో దీన్ని బట్టే అర్థమవుతోంది కదా.