Begin typing your search above and press return to search.
సౌండ్ లేకుండా స్వీటీ బాదుడు!
By: Tupaki Desk | 23 Feb 2020 5:27 AM GMTస్వీటీ అనుష్క లేడీ ఓరియేంటెడ్ చిత్రం `నిశబ్ధం` చిత్రీకరణ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భాగమతి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్వీటీ దాదాపు రెండేళ్లు గ్యాప్ తో వస్తోంది. మధ్యలో సైరా నరసింహారెడ్డిలో ఝాన్సీ లక్ష్మిభాయ్ పాత్రలో నటించింది. నరసింహారెడ్డి వీరత్వం గురించి ఉద్భోధించే గెస్ట్ రోల్ కావడంతో కొన్ని నిమిషాలకే పరిమితమైంది. అందుకే స్వీటీని పూర్తి స్థాయి సినిమాలో చూడాలన్నది అభిమానులు ఆశ. ఆ క్రమంలోనే `నిశ్శబ్ధం` సెట్స్ పైకి వెళ్లింది. నాయికా ప్రాధాన్యత ఉన్న కాన్సెప్ట్ కాబట్టి కోన వెంకట్ టీమ్ స్వీటీని ఏరికోరి మరీ ఎంపిక చేసారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెలుగు- తమిళ భాషల్లో కోన వెంకట్- టి. జి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెరికాలో మెజారిటీ భాగం తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
మరి ఈ సినిమాకు స్వీటీ పారితోషికం ఎంత? స్వీటీ శ్రమకు తగ్గ వేతనమే దక్కిందా? అంటే అవుననే ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. 2.5 కోట్ల మేర పారితోషికం తీసుకుందిట. అదీ జీఎస్టీ మినహాయింపుతో. ఆ మొత్తాన్ని నిర్మాతలే ప్రభుత్వానికి కట్టాల్సిందేనట. ఈ సినిమా ప్రారంభానికి ముందు కొంత మొత్తం చెల్లించగా...చిత్రీకరణ పూర్తయ్యాక బ్యాలెన్స్ క్లియర్ చేసారుట. ప్రస్తుతం తెలుగు హీరోయిన్లలలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలలో స్వీటీనే టాప్ వన్ పొజిషన్ లో నిలుస్తోంది. `నిశ్శబ్ధం` ఆలస్యమైనా స్వీటీకి దక్కాల్సింది దక్కిందని తెలుస్తోంది.
బాహుబలి 1.. బాహుబలి 2 రెండు భాగాలకు కలిపి స్వీటీ భారీగానే ఛార్జ్ చేసింది. ఆ తర్వాత అధిక మొత్తం రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా `నిశబ్ధం` అనే లీకులందుతున్నాయి. ప్రస్తుతం ఫేమ్ లో ఉన్న హీరోయిన్లకు జీఎస్టీతో కలిపి కొటిన్నర వరకూ చెల్లిస్తున్నారు. వీళ్లకు పన్ను మినహాయింపులేవీ ఉండవు. కానీ స్వీటీ మాత్రం స్పెషల్ అందుకే ఇవ్వాల్సినది గౌరవప్రదంగా ఇచ్చి.. పన్ను భారం భరించి మరీ గౌరవించారట. మొత్తానికి స్వీటీ సౌండ్ లేకుండా నిర్మాతల్ని బాగానే బాదేసిందన్నది ఇన్ సైడ్ టాక్.