Begin typing your search above and press return to search.

అనుష్క ఒక మానసిక రోగేనా??

By:  Tupaki Desk   |   10 July 2017 7:00 AM GMT
అనుష్క ఒక మానసిక రోగేనా??
X
బాలీవుడ్ కమర్షియల్ హీరోయిన్ గా ఇప్పుడు కొనసాగుతున్న అనుష్క శర్మా.. సినిమాల్లో నటిస్తూనే ప్రొడ్యూసర్గా మారింది. అనుష్క చేసిన కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఫ్లాప్ అయినా ‘సుల్తాన్’ - ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చింది. అలాగే ప్రొడ్యూసర్గా మారి ‘ఎన్‌హెచ్ 10’ - ‘ఫిల్లౌరి’ సినిమాలు ఫ్లాపైనా.. ఇప్పుడు మరో సినిమాతో వస్తోంది.

కొద్ది కాలం కిందట విడుదల చేసిన అనుష్క కొత్త సినిమా ‘పరి’ ఫస్ట్ లుక్ చూసి తోటి నటులు - చిత్ర వర్గాలు - సినీ ప్రేక్షకులు షాక్ తిన్నారు. అందరిని కొంచం బయపెట్టింది. అయితే తన ప్రొడ్యూస్ చేసిన ‘ఫిల్లౌరి’ సినిమాలో దెయ్యంగా కనిపించిన అనుష్క.. ఒక మంచి దెయ్యంగా అలరించింది. ఇప్పుడు ‘పరి’ సినిమాలో మాత్రం తనని తానే ఏదో ప్రపంచంలో ఉన్నట్లు ఊహించుకొంటూ.. జీవకళ బొత్తిగా పోయిన మానసిక రోగిలా కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా రిలీజైన పోస్టర్ చూస్తుంటే.. కాలికి కూడా ఏదో గాయమై ఉంది. బహుశా ఏదో నిరాశలో ఉండి గదిలో తనకి తానే ఇలా నిర్భందించుకొని అవస్థ పడుతుందా అనే అనుమానం అయితే అందరికి వస్తోంది. తనలో క్రియేటివిటీ సంతృప్తి చెందకపోవడంతో తానే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తుందనుకుంట అనుష్క!!

‘పరి’ సినిమా 2018 ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా అనుష్క సోషల్‌ మీడియాలో సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను క్లీన్‌స్లేట్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై అనుష్క శర్మ నిర్మిస్తోంది. ప్రోసిత్‌ రాయ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.​ ఇకపోతే అనుష్క ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సరసన చేసిన ‘జాబ్ హ్యారి మెట్ సెజల్’ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్.